రామాయణమహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ – అంటే, రామాయణమనే మహామాలలో రత్నమైన పవనసుతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. రామాయణంలో శ్రీరాముని తరువాత అంతటి ఉదాత్తమైన పాత్ర ఏదైనా ఉన్నదంటే, అది నిస్సందేహంగా ఆంజనేయుడిదే. బ్రహ్మదేవుడు, వాల్మీకి మహర్షి కలసి హనుమంతుణ్ని సకల సద్గుణాల సమాహారంగా తీర్చిదిద్దారు. రాముడిలోనూ ఈ గుణాలన్నీ ఉన్నాయి. అందుకే ఎందరెందరో సాధకులు హనుమను ఆరాధించి జన్మను చరితార్థం చేసుకున్నారు. ఆంజనేయుడి కథను అలతి అలతి పదాలతో అందమైన పద్యాలుగా మలిచి ‘హనుమ పదములు’ అందించారు కవి ఆళ్లపల్లి రవీంద్రరావు. హనుమంతుడి గుణగణాలు, ఆయన సాధించిన విజయాలు, స్వామిభక్తి అన్నిటినీ అందంగా అక్షరీకరించారు.
రచయిత: ఆళ్లపల్లి రవీంద్రరావు
పేజీలు: 20, ధర: అమూల్యం
ప్రతులకు: 90001 10309
రచన : సురేంద్ర రొడ్డ
పేజీలు : 120
ధర : రూ.200
ప్రచురణ : జ్ఞాపిక శీర్షిక ప్రచురణలు
ప్రతులకు : రొడ్డ ఉషా సురేంద్ర
ఫోన్ : 94915 23570