పుస్తక సమీక్ష
రమజాన్ ఉపవాసం అంతరార్థం అన్నపానీయాలకు దూరంగా ఉండటమే కాదు.. ధర్మబద్ధ జీవనాన్ని అలవాటు చేసుకోవడమే. అలాగే కోరికలకు కళ్లెం వేయడం, ఓర్పు, సహనం పెంపొందించుకోవడం. ఈ ఉపవాసాలను ధర్మనిష్ఠతో ఆచరించడం అత్యవశ్యకం.
- సంస్కరణకు మార్గం
రమజాన్ ఉపవాసం అంతరార్థం అన్నపానీయాలకు దూరంగా ఉండటమే కాదు.. ధర్మబద్ధ జీవనాన్ని అలవాటు చేసుకోవడమే. అలాగే కోరికలకు కళ్లెం వేయడం, ఓర్పు, సహనం పెంపొందించుకోవడం. ఈ ఉపవాసాలను ధర్మనిష్ఠతో ఆచరించడం అత్యవశ్యకం. ధర్మనిష్ఠ పాటించడం అంటే అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉండటమే! ఇలా రమజాన్ ఉపవాసాలకు సంబంధించిన సమగ్ర విషయాలను ‘రమజాను ఉపవాసాలు’ పుస్తకం మనకు వివరిస్తుంది.
ఉపవాసం ఎవరు పాటించొచ్చు? నియమాలు, నిబంధనలు, దానం వల్ల కలిగే ఫలితాలు ఈ విషయాలన్నీ ఈ గ్రంథంలో క్లుప్తంగా, సరళంగా ఈ పుస్తకంలో వివరించారు. ఇఫ్తార్‌ను విరమింపచేయడం పుణ్యకార్యం ఎలా అవుతుంది? షబే ఖద్ రాత్రి విశిష్టత ఏమిటి? తదితర ప్రత్యేక విషయాలపై ఈ పుస్తకంలో వివరణలు చూడొచ్చు.
రమజాను ఉపవాసాలు
పేజీలు: 64, మూలం: మౌలానా సిరాజుద్దీన్ నద్వి
అనువాదం: ముహమ్మద్ గౌస్ ఖాన్
వెల: ఉచితం పుస్తకాల కోసం సంప్రదించండి
టోల్ ఫ్రీ నెంబర్: 1800 572 3000
-ముహమ్మద్ ముజాహిద్
కళాప్రపంచ వీక్షణ గవాక్షం
మనిషన్నాక కొంచెమైనా రసజ్ఞత ఉండాలి. లేకుంటే మన చదువులు, అభివృద్ధి నిరర్థకం. మనిషి మానసికంగా, ఆత్మికంగా ఉన్నత స్థాయిని చేరుకున్నాడని చెప్పాలంటే లలిత కళల సృష్టి, వాటిని ఆస్వాదించడం కొలమానాలుగా ఉంటాయి. ఆధునిక విద్య, ఉద్యోగాల కారణంగా తెలుగు సమాజంలో లలిత కళల పట్ల పట్టింపు కొంచెం తగ్గుముఖం పట్టిందనే మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగువారికి… సంగీతం, శిల్పం, సాహిత్యం, చిత్రలేఖనం, వాస్తుశిల్పాలకు సంబంధించిన సువిశాలమైన లలిత కళా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ రచయిత, చిత్రకారుడు ఎల్.ఆర్.వెంకటరమణ రాసిన పుస్తకమే ‘కళాప్రపంచం’.
బెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు అబనీంద్రనాథ్ టాగూర్, విశ్వగురువు రవీంద్రనాథ్ టాగూర్, తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు, ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్, తెలుగు చిత్రకారులు సి.ఎన్.వెంకటరావు, సాహితీవేత్తలు విశ్వనాథ, సినారె, రావూరి భరద్వాజ తదితరుల జీవితాలను పరిచయం చేస్తూ రాసిన 53 వ్యాసాల సమాహారం ఈ ‘కళాప్రపంచం’. హిట్లర్, చర్చిల్, ఐసన్ హోవర్ లాంటి ప్రసిద్ధ రాజకీయ నాయకుల కళాహృదయాన్నీ రచయిత ఇందులో ఆవిష్కరించారు. మన మనసులకు ఆహ్లాదాన్ని చేకూర్చే లలిత కళల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖుల జీవితాలను గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది. కళా ప్రేమికులే కాకుండా సాధారణ పాఠకులూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ ‘కళాప్రపంచం’.
కళాప్రపంచం
రచన: ఎల్.ఆర్.వెంకటరమణ
పేజీలు: 200, ధర: రూ. 250
ప్రచురణ: 64కళలు.కాం
ప్రతులకు: ఫోన్: 98852 89995
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

