రాజస్థానీ భర్వా మిర్చి.. రొట్టెలతో కలిపి తింటే యమ రుచి
పచ్చి మిరపకాయలతో ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. అందులో ఒకటి రాజస్థానీ భర్వా మిర్చి. దీన్ని చపాతీలు, నాన్లు, జొన్నరొట్టె వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వింటుంటేనే జిహ్వ జివ్వుమంటుంది కదూ. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
బజ్జి మిర్చి: పావు కిలో
జీలకర్ర: టేబుల్ స్పూన్
సోంపు: టేబుల్ స్పూన్
మిరియాలు: అర స్పూను
ధనియాలు: రెండు టేబుల్ స్పూన్లు
పసుపు: పావు స్పూను
కారం: టీ స్పూను
ఆవనూనె: అర కప్పు
నిమ్మ ఉప్పు: టీ స్పూన్
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా పచ్చిమిర్చిని బాగా కడిగి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టాలి. అందులో జీలకర్ర, ధనియాలు, సోంపు, మిరియాలు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త బరకగా మిక్సీ పట్టి అందులో ఉప్పు, పసుపులను కూడా కలపాలి. ఇప్పుడు మళ్లీ ఒక్కసారి మిక్సీ తిప్పాలి. ఆవ నూనెను చిన్న గిన్నెలో పోసి పొగలు వచ్చేలా బాగా వేడి చేయాలి. ఇందాక కడిగి ఆరబెట్టుకున్న మిర్చిని చాకుతో పొడవుగా చీరుకోవాలి. మధ్యలో ఉండే గింజల్లో కొన్నింటిని తీసివేయాలి. ఇప్పుడు వీటిమీద ఇందాక పట్టుకున్న పొడిని బాగా చల్లాలి. తర్వాత వేడి వేడి ఆవనూనెను మిర్చీల మీద పోసి బాగా కలియదిప్పాలి. నిమ్మ ఉప్పును మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమానికి కలపాలి. ఒకరోజు ఊరనిచ్చి రొటీ, నాన్, జొన్న రొట్టె లాంటి వాటితో కలిపి తింటే… రుచిగా ఉంటాయి.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

