పుస్తక సమీక్ష కథల్లో – కార్పొరేట్ ప్రపంచం
ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు కార్పొరేట్ మయమైపోయాయి. వ్యాపార సంస్థల నిర్వహణ కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక మేనేజ్మెంట్ విద్య కూడా అందుబాటులో ఉంది. ఇందులో విద్యార్థులకు సిద్ధాంతాలు, కేస్ స్టడీస్ రూపాల్లో తరగతులు ఉంటాయి. ఎంతైనా తరగతి పాఠాలంటే కొంత నిరుత్సాహం ఉండిపోతుంది. అదే కథల రూపంలో అయితే ఉత్సాహంగా వింటాం. ‘కనెక్టింగ్ ఫేబుల్స్ విత్ ద కార్పొరేట్ వరల్డ్' పుస్తకం సరిగ్గా ఇదే చేసింది.
ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు కార్పొరేట్ మయమైపోయాయి. వ్యాపార సంస్థల నిర్వహణ కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక మేనేజ్మెంట్ విద్య కూడా అందుబాటులో ఉంది. ఇందులో విద్యార్థులకు సిద్ధాంతాలు, కేస్ స్టడీస్ రూపాల్లో తరగతులు ఉంటాయి. ఎంతైనా తరగతి పాఠాలంటే కొంత నిరుత్సాహం ఉండిపోతుంది. అదే కథల రూపంలో అయితే ఉత్సాహంగా వింటాం. ‘కనెక్టింగ్ ఫేబుల్స్ విత్ ద కార్పొరేట్ వరల్డ్’ పుస్తకం సరిగ్గా ఇదే చేసింది. పుస్తక రచయిత డాక్టర్ ఎ. ఎజిల్ కుమార్ ఐఐఎం అహ్మదాబాద్ పట్టభద్రుడు. దాదాపు 30 ఏండ్ల కార్పొరేట్ అనుభవంతో ఈ రచనకు ఉపక్రమించారు. మొత్తం 54 కథలను సెల్ఫ్, పీర్స్, బాస్, వర్క్ ఎన్విరాన్మెంట్, ఆంత్ర ప్రెన్యూర్షిప్.. అనే ఐదు భాగాల్లో వివరించారు. ప్రతీ అధ్యాయం ఒక ప్రసిద్ధ జానపద కథతో మొదలవుతుంది. ఆ తర్వాత రచయిత కార్పొరేట్ ప్రయాణం అనుభవంతో అనుసంధానమై ఉంటుంది. చివర్లో ఆ అధ్యాయంలోని నీతి ఉంటుంది. ఇది పాఠకుల కెరీర్‌కు సంబంధించినదై ఉంటుంది. మొత్తానికి ఈ పుస్తకం మొదటినుంచి చివరి వరకు చదివేవారిని కట్టిపడేస్తుంది.
కనెక్టింగ్ ఫేబుల్స్ విత్ ద కార్పొరేట్ వరల్డ్
రచన: డాక్టర్ ఎ. ఎజిల్ కుమార్
పేజీలు: 263; ధర: రూ. 285
ప్రచురణ: క్లెవర్ ఫాక్స్ పబ్లిషింగ్
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
శైశవ గీతాలు
మనిషి జీవితంలో మరపురానిది బాల్యం. అందులోనూ శైశవం మరీ ప్రత్యేకం. ‘మహాప్రస్థానం’లోనూ ‘పాపం పుణ్యం ప్రపంచమార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ/ ఏమీ ఎరగని పూవుల్లారా/ అయిదారేడుల పాపల్లారా..’ అంటూ శైశవగీతి ఆలపించారు శ్రీశ్రీ. ఆ శిశురాగాలను మనుమడి బుడిబుడి అడుగుల్లో, బుజ్జిబుజ్జిమాటల్లో అనుభవించి.. తాను ఆడించడం కాదు, తన మనుమడే తనను ఆడించాడని పేర్కొంటూ.. వివిధ సందర్భాల్లో పసివాడి సమక్షంలో తాను పొందిన అనుభూతుల్ని ‘చిన్నోడి ముక్తకాలు’ పేరుతో 98 చిరు కవితలుగా అక్షరీకరించారు వారాల ఆనంద్ . ఆ చిన్ని శిశువు చేసే చిత్రాలెన్నో. బిడ్డ ఏడ్చినా ఆనందమే. నవ్వినా ఆనందమే. బుడిబుడి అడుగులు వేస్తూ, తడబడుతూ నత్తినత్తిగా మాట్లాడే ఆ మాటలు మనకు కొత్తభాషను నేర్పిస్తాయి. రచయిత ఓ ముక్తకంలో చెప్పినట్టు శిశువంటే… రోజంతా మన కాలాన్ని మింగేసే వాడు ఎంతమాత్రమూ కాదు. మన జీవితకాలాన్ని పొడిగించే ఔషధం.
పిల్లలున్న ఇండ్లే ఇండ్లు. లేకుంటే అవి ఆనంద్ చెప్పినట్టు మ్యూజియంలే. ‘చిన్నోడి ముక్తకాలు’ పేరుకు మనుమడితో ఆనంద్ అనుభవాలే అయినా.. అనుభూతిపరంగా పిల్లల్ని ప్రేమించే ప్రతి ఒక్కరివీ.
చిన్నోడి ముక్తకాలు
రచన: వారాల ఆనంద్
పేజీలు: 122, ధర: రూ. 75
ప్రచురణ: పోయెట్రీ ఫోరం
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
-సి. హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- books
- pustaka released
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!


