కంచమెత్తుకో కొడుకా!
కిష్టమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లోడు బాగా ఎదిగితే పొలం పనులు చూసుకుంటాడని ఆమె ఆలోచన. ఎండాకాలం వచ్చింది. సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో కొన్నాళ్లు ఉండి వస్తానని వెళ్లాడు. అమ్మమ్మకి మనవడంటే మహా ప్రేమ. వాణ్ని ముద్దుముద్దుగా చూసుకునేది.
కిష్టమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లోడు బాగా ఎదిగితే పొలం పనులు చూసుకుంటాడని ఆమె ఆలోచన. ఎండాకాలం వచ్చింది. సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో కొన్నాళ్లు ఉండి వస్తానని వెళ్లాడు. అమ్మమ్మకి మనవడంటే మహా ప్రేమ. వాణ్ని ముద్దుముద్దుగా చూసుకునేది. రెండు వారాలయ్యాక.. కొడుకు ఎలా ఉన్నాడో చూసి వద్దామని కిష్టమ్మ కూడా అమ్మగారింటికి వెళ్లింది. ఈ రెండు వారాలూ ఇంటి పట్టునే ఉండి.. బాగా తిని కండపట్టి ఉన్నాడు కొడుకు. అయితే, ఇంటి చుట్టూ గుబురు చెట్లు ఉన్నాయి. వంటకు కట్టెలు కావాలి. “కట్టెలకు పోదాం రారా కొడుకా!” అని అడిగింది కిష్టమ్మ. గోడకు తగిలిన బంతిలాగా వెంటనే.. “కడుపు నొప్పే అమ్మా!” అన్నాడు వాడు. “సరే మరి.. కంచం ఎత్తుకో కొడుకా!” అంది కిష్టమ్మ. “అట్ల చెప్పే అమ్మా!” అంటూ తిండికోసం కంచం ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు సుఖం మరిగినాడని అర్థం చేసుకుంది తల్లి. అమ్మమ్మ దగ్గర ఉంటే మహాసోమరి అవుతాడని తెలుసుకుంది. ‘ఎదిగే పిల్లోడికి తినడానికి చెరుకు గడలు ఇవ్వాలి కానీ, చెరుకు రసం చేసి ఇస్తే సుఖం మరగరా’ అనుకుంది. మరుసటిరోజే కొడుకును తీసుకుని ఇంటికి వచ్చేసింది. పనీపాటా నేర్పించి ప్రయోజకుడిని చేసింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు
చెప్పుకోండి
పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది?
– సెల్ఫోన్
ఎందరు ఎక్కినా.. విరగని మంచం?
– అరుగు
కాళ్లూ, చేతులు లేని అందగత్తెకు బోలెడు బట్టలు?
– ఉల్లిగడ్డ
పెద్దల మాట
ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకుల మాదిరిగా
ప్రవర్తించాలి. స్వార్థాన్ని వీడి, వారి అభివృద్ధికి కృషి చేయాలి. – స్వామి వివేకానంద
పద్యం – భావం
ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటఁదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎన్ని స్థలాలు తిరిగినా, ఎన్ని కష్టాలు పడినా, ఏదీ దక్కకుండా శని వెన్నంటే ఉంటుంది. పూర్వం శివుడినే వెంబడించి బాధలు పెట్టింది కదా! అలాగే భూమి కొత్తదైనంత మాత్రాన.. జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

