Vastu Shastra | మేధాశక్తి కన్నా శాస్ర్తాలు ఎలా గొప్పవి?
మరీ అంత కఠినంగా ‘వద్దు’ అనాల్సిన అవసరం లేదు. ఒక్కో రోడ్డును బట్టి స్థలం ముఖాలు - దాని గుణాలు మారుతూ ఉంటాయి. అలాగని పనికిరానివి కావు. మీది దక్షిణం - తూర్పు వీధి ఉన్న స్థలం. అది తప్పుడు స్థలం, నిషేధం అంటే ఎలా? కాకరకాయ చేదు.
Vastu Shastra | ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టకూడదా? అందరూ ‘వద్దు’ అంటున్నారు. నిజమా? మేము కొన్నాం.
– బద్రినాథ్, ములుగు
మరీ అంత కఠినంగా ‘వద్దు’ అనాల్సిన అవసరం లేదు. ఒక్కో రోడ్డును బట్టి స్థలం ముఖాలు – దాని గుణాలు మారుతూ ఉంటాయి. అలాగని పనికిరానివి కావు. మీది దక్షిణం – తూర్పు వీధి ఉన్న స్థలం. అది తప్పుడు స్థలం, నిషేధం అంటే ఎలా? కాకరకాయ చేదు. కొందరు ఆ పేరు చెబితేనే వద్దని అంటారు. కానీ, వండే తీరుగా వండితే.. ఎగబడి తింటారు. అన్ని స్థలాలూ గొప్పవే! అందులో గృహాన్ని మన ఇష్టానుసారం కట్టడం కాదు. ఆ స్థలంలో గృహం ఎలా కట్టాలో వాస్తు శాస్త్రం వివరిస్తుంది. కచ్చితంగా ఆ విధానాల్లో కట్టాలి. అప్పుడు ఆ స్థలం తప్పక మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆ చోట దక్షిణం రోడ్డును ప్రధానంగా చేసుకొని ఇల్లు కట్టాలి. తప్పక దక్షిణం సింహద్వారం పెట్టాలి. మళ్లీ దక్షిణం పనికిరాదు కదా? అనుకోవద్దు. తప్పక పనికొస్తుంది. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే.. మీ స్థలం వాస్తుపరంగా చక్కగా దిక్కులకు, దిశలకు కుదిరిందా, లేదా? ఆ స్థలం యోగ్యమైనదా, కాదా? అన్నది ముందు చూసుకోండి.
మాది విల్లా. పడమర రోడ్డు, తూర్పు రోడ్డు ఉంది. పార్కింగ్ ఎక్కడ ఉంటే బాగుంటుంది? షెడ్డు వేయాలి.
– డి. వీరేశం, బోయిన్పల్లి
రెండు రోడ్లు ఉన్నాయి కాబట్టి, మీరు తూర్పు ముఖం చేసి ఇల్లు కడతారేమో? అలాగే పడమర పెద్దరోడ్డు ఉంటే.. అటు ముఖం చేసి కూడా గొప్పగా కట్టుకోవచ్చు. కారు పార్కింగ్ అనేది ఇవ్వాళ ఇల్లు కట్చేసి మాత్రమే పెట్టుకోవాలి అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఇంటికి ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలి కూడా పెట్టుకోవచ్చు.

అలాగే తూర్పులో ఖాళీగా వదిలి కార్లు నిలుపుకోవచ్చు. అక్కడ ఆగ్నేయంలో షెడ్డు వేయవచ్చు. మీరు ఇంటిని కట్ చేసి ఒక మూల పెట్టాలి అనుకుంటే.. పశ్చిమ వాయవ్యంలో పార్కింగ్ వదిలి కట్టాలి. అప్పుడే అది మంచి ఇల్లు అవుతుంది. ‘తూర్పు సింహద్వారంతో ఇల్లు కడతాం. తూర్పు – ఈశాన్యంలో కార్కు పార్కింగ్ పెట్టుకోవచ్చు’ అనుకుంటే.. పెద్ద దోషం అవుతుంది. దానిని ఈశాన్యం ఖాళీ స్థలం వదలడం అనుకోవద్దు. ఇంటి ఈశాన్యం కత్తిరిస్తున్నాం అనే సంగతి మరువకూడదు.
మాది చాలా పెద్ద స్థలం. కానీ, పొడవైన ఒక త్రిభుజం. అందులో స్కూల్ బిల్డింగ్ కట్టుకోవచ్చా?
– జి. సరస్వతి, చాడ
ఎంత పెద్ద, ఎన్ని ఎకరాల స్థలం అయినా.. ఆ త్రిభుజాకారాన్ని ముందుగా సంస్కరించాలి. అంటే, ఆ స్థలాన్ని ఏ మూలా తెగకుండా జాగ్రత్తగా ఒక దీర్ఘ చతురస్ర స్థలాన్ని ముందుగా మార్కింగ్ చేయాలి. అది దిశకు – మెట్నకు కుదిరి ఉండాలి. ఆ స్థలం లెక్కించి దాని వైశాల్యం – దానికి వచ్చే రోడ్డును అనుసరించి ఆ స్థలంలో స్కూలు భవనం ప్లాన్ చేయండి. చాలా బాగా వస్తుంది. మిగతా స్థలాన్ని వదిలేసి చుట్టూ కాంపౌండ్ కట్టండి. కాంపౌండ్ కట్టడం అనివార్యం. అపుడే ఆ స్థలం యోగిస్తుంది. వదిలిన భాగంలో మొక్కలు పెంచండి. గ్రీనరీగా ఉపయోగపడుతుంది. అలా త్రిభుజాకారంలో కట్టాలనుకుంటే.. అది పెద్ద స్థలం అయినప్పుడే కుదురుతుంది. చిన్న త్రిభుజాలు ఎందుకూ పనికిరావు.

నాదొక సందేహం. మేధాశక్తి కన్నా శాస్ర్తాలు ఎలా గొప్పవి అవుతాయి?
– ఎన్. వరలక్ష్మి, సైదాబాద్
మంచి ప్రశ్న. మేధాశక్తి గొప్పదైనంత మాత్రాన అతనికి భార్యా – పిల్లలు – ఇల్లు – వ్యవహారాలు – అధికారం అక్కరకు రావా? అవసరం ఉండదా? ‘నాకు, నీకు ఉన్న మేధాశక్తి.. వర్షాన్ని ఆపుతుందా? చలిని తగ్గిస్తుందా? నీ గుండె వేగాన్ని, ఆందోళనను నిరోధిస్తుందా?’ ఇలా నేను ప్రశ్నిస్తే.. వెంటనే మీరు ‘మీ వాస్తు ఆపుతుందా?’ అంటారు. అందుకే, మేధాశక్తికి, శాస్ర్తానికి సంబంధం లేదు. వ్యక్తి ఒక భౌతిక శరీరంతో ఈ లోకంలోకి వచ్చాడు. అతని జీవనయానం ప్రశాంతంగా సాగాలి. విమానంలో ప్రయాణించే మేధావుల జీవితాలు కూడా.. ఆ విమానం కండిషన్ మీద ఆధారపడి ఉంటాయా, లేదా? అలాగే.. ప్రకృతి (శాస్త్రబద్ధమైన) నియమాలపైన ఆధారపడి నిర్మించిన గృహం.. ఆ ఇంటి సభ్యులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అత్యంత సురక్షితమైన కారు లోయలో పడితే.. అందులోని వ్యక్తి మరణించే అవకాశం తక్కువగా ఉంటుంది. శాస్ర్తాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

