‘ట్రైగ్’ ట్రై కరో.. ఖుషీసే జీవో!
ఏటా ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో డెన్మార్క్ టాప్-3లో ఉంటుంది. ఈ దేశంలో ట్రైగ్ అనే కార్యక్రమం వారిని సంతోషంగా ఉంచుతుంది. భయం, ఆందోళన లేకుండా శరీరాన్ని విశ్రాంతి స్థితికి చేర్చి మనసును ప్రశాంతంగా ఉంచడమే ట్రైగ్. ఈ ట్రైగ్ను ట్రై చేసి మనం కూడా ఖుషీగా జీవిద్దాం.
ఇన్ఫోగ్రాఫిక్
‘ట్రైగ్’ అనేది డెన్మార్క్ సంస్కృతిలో ఒక భాగం. అక్కడి ప్రజల జీవన విధానాన్ని, సమాజ నిర్మాణాన్ని నడిపించే ఒక శక్తిమంతమైన సాధనం. సాధారణంగా.. ‘ట్రైగ్’ అంటే సేఫ్ (సురక్షితం) అని అర్థం. కానీ, లోతుగా అర్థం చేసుకుంటే.. ‘ట్రైగ్’ అంటే శరీరం, మనసు ప్రశాంతంగా ఉండటం. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా.. శరీరం విశ్రాంతి స్థితికి చేరుకోవడం.
సంతోషానికి చిరునామా
ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన, ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ ఒకటి. ఏటా ప్రకటించే ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో టాప్-3లో తప్పకుండా నిలుస్తుంది. అయితే, డెన్మార్క్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ‘ట్రైగ్’ కీలకపాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రుల చేతుల్లోని పిల్లలు ఎలాంటి ఆందోళన, అభద్రతాభావం లేకుండా హాయిగా ఉంటారో.. అలాంటి మానసిక ప్రశాంతతను అనుభవించడమే ‘ట్రైగ్’. తమదేశంలోని ప్రతి ఒక్కరిలోనూ ఈ భావన పుట్టుకతోనే వస్తుందని డెన్మార్క్వాసులు నమ్ముతారు.

Family
సామాజిక బాధ్యత
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ‘భద్రత’ను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తారు. కానీ, డెన్మార్క్‌లో అదొక సామాజిక బాధ్యత. పాఠశాలలు, కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, చివరికి ప్రభుత్వ విధానాలు.. అన్నీ కూడా ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తాయి. ఇక్కడి సమాజంలోని ప్రతి ఒక్కరూ తోటివారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా వ్యవహరిస్తారు. ఒకరిపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించే వాతావరణాన్ని సృష్టిస్తారు. అందుకే.. ఇక్కడ పిల్లల్ని ఒంటరిగా బడికి పంపిస్తారు. కేఫ్‌ల బయట చిన్నారులను నిద్రపుచ్చుతారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా.. హాయిగా సమయాన్ని గడుపుతారు.

School Boy
నో పోటీ
డెన్మార్క్‌లోని ప్రతిచోటా ‘ట్రైగ్’ భావన కనిపిస్తుంది. బడి పిల్లలపై ఒత్తిడి తగ్గించడానికి ఇక్కడి ప్రాథమిక పాఠశాలల్లో హోమ్‌వర్క్, పరీక్షలు, పోటీలు ఉండవు. పిల్లలు ఎలాంటి భయం లేకుండా నేర్చుకునే వాతావరణం ఉంటుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ.. సమావేశాలు చాలా పద్ధతిగా జరుగుతాయి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, ఎవరికీ ఎలాంటి అనిశ్చితి లేకుండా స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తారు.
ఒకరికొకరు
ప్రజాజీవితంలోకి వస్తే.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, పబ్లిక్ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పోగొట్టుకున్న పర్సులు తిరిగి ఇవ్వడం వంటివి ఇక్కడి సామాజిక నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తాయి. అందరికీ ఉచిత విద్య, ఆరోగ్యం, పేరెంటల్ లీవ్ వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల జీవితంలో అనవసరమైన ఆర్థిక, సామాజిక ఆందోళనలను తొలగించేలా డెన్మార్క్ ప్రభుత్వం పనిచేస్తుంది. మొత్తంగా.. ఒకరికొకరు తోడుగా ఉంటూ, ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా జీవించడమే.. డెన్మార్క్ సంస్కృతి ‘ట్రైగ్’ అసలు రహస్యం.

Zebra Crossing

Cleaning
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- happily
- Infographic
- live
- Trig try
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

