ఇప్పుడు రీ సైకిల్ ట్రెండ్ నడుస్తున్నది. భూమికి అత్యవ సరమైన ఈ పునర్వినియోగాన్ని కొన్ని సంస్థలు బాధ్యతగా తీసుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఫంకీ కళాకార్ ఒకటి. జీన్సు, లెదర్, టైర్లలాంటి వాటిని రీసైకిల్ చేసి యాక్సెసరీలను రూపొందిస్తున్నదీ సంస్థ. ఒక బ్యాగును కనీసం ఎనిమిది సార్లు రీసైకిల్ చేయ గలిగే మెటీరియల్‌తో చేస్తున్నారు. వీళ్లు ఈ మధ్య గోధుమ, నలుపు రంగుల్లో బకెట్ తరహాలో ఒక బ్యాక్‌ప్యాక్‌ను తీసుకువచ్చారు. ఫ్యాషనబుల్‌గా ఉండే ఈ ఉత్పత్తిని మైక్రో ఫైబర్ లెదర్‌ను రీ సైకిల్ చేసి మరీ తయారుచేశారు. దీన్ని ‘రీసైకిల్డ్ లెదర్ బ్యాక్‌ప్యాక్’గా పిలుస్తున్నారు. భుజానికి తగిలించుకునేందుకు వీలుగా స్ట్రాప్స్ ఇచ్చారు. పైన, పక్కన జిప్‌లు వచ్చేలా బ్యాగ్ డిజైన్ చేశారు. ధర. రూ.4,500. ogaan.comవెబ్సైట్లో కొనుక్కోవచ్చు.
గ్యాప్ ఇచ్చారు…
ఉంగరాల్లో సాదా మొదలు రాళ్లు పొదిగినవి వరకూ.. ఎన్నో రకాలు. అందులోనూ వజ్రపుటుంగరానికి ఉన్న ప్రత్యేకత మరేదానికీ లేదనే చెప్పాలి. దానికి మరింత ఫ్యాషన్ లుక్ తీసుకొస్తూ ‘ట్విన్ రింగ్’ని తయారుచేసింది ఎంవోఐ సంస్థ. ఇందులో ఉంగరం మధ్యభాగం ఖాళీగా ఉంటుంది. రెండువైపులా ఎదురెదురుగా పువ్వులు వచ్చినట్టు కనిపించేలా వజ్రాలు పొదిగి ఉంటాయి. ఆ పువ్వుల పక్కగా మరికొన్ని సన్నని వజ్రాలను కూర్చి అంగుళీకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు చేయితిరిగిన
డిజైనర్లు. vibewithmoi.in లో అమ్ముతున్నారు. 14 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ ఉంగరం ధర 92,700 రూపాయలు.
పంచెకట్టు ఫ్యాషన్‌గా…
పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలిగే వాళ్లు ఉండాలే కానీ, ధోతీ కూడా దుమ్మురేపే ఫ్యాషన్ లుక్‌ని తెచ్చిపెడుతుంది. ట్రెండీ పరేడ్‌లో కుర్తా సత్తా చాటుతుంది. ఇక, తయారుచేసింది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియాని అయితే.. గ్లామర్ సంగతి చెప్పే అవసరమే లేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది సాక్షాత్తు తరుణ్ డిజైన్ చేసిన
ధోతీ కుర్తా సెట్. హాఫ్ వైట్‌లో భుజం మీద కుచ్చులతో వచ్చిన ఈ అన్ ఈవెన్ కుర్తాను మోగా శాటిన్ సిల్క్‌తో తయారు చేశారు. లేత బంగారం రంగు పట్టు బ్రొకేడ్ వస్త్రంతో ఈ ధోతీని తీర్చిదిద్దారు. ధర రూ.89,900 మాత్రమే. ఆసక్తి ఉంటే.. taruntahiliani.com వ్బైసైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
యాత్రా బుక్!
చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం. కొత్తకొత్త ప్రాంతాలకు వెళ్లడం, రకరకాల రుచుల్ని ఆస్వాదించడం, వివిధ సంస్కృతుల్ని పరిశీలించడం అంటే సరదా. అలాంటివాళ్లు తమ ప్రయాణ జ్ఞాపకాలను చక్కగా రాసుకునేందుకు, మళ్లీ చదువుకుంటూ గుర్తు చేసుకునేందుకు వీలుగా ఆరిజిన్ ఒన్ సంస్థ ‘ట్రావెల్ అల్మనాక్’ పేరిట ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో రెండొందల పేజీలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి… ఇలా ఏ పూట ఏం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారన్నది రాసుకునే వీలుంది. ట్రావెల్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారన్నదీ రాసుకోవచ్చు. రోజువారీ విషయాలనూ నోట్ చేసుకోవచ్చు. ఈ పుస్తకాలను అచ్చంగా ప్రకృతి వనరులను వినియోగించే తయారు చేస్తున్నారు. పుస్తకాన్ని తయారుచేసిన ప్రతిసారీ వాడినదానికన్నా రెట్టింపు మొక్కలను నాటుతున్నారు. అందుకే జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ అని ఈ పుస్తకాల మీద రాసి ఉంటుంది. originone.com వెబ్సైట్ ద్వారా ఖరీదు చేయవచ్చు. ఈ ట్రావెల్ బుక్ ధర రూ.1,750.