Diwali lights | ఈ దీపావళికి బొమ్మ దీపాలు పెట్టేద్దాం!
Diwali lights | దీపావళి అంటేనే.. సిరుల తల్లికి పూజలు, టపాసుల జోరులు, వెలుగులీనే ముస్తాబులు. ఊరూ వాడా దీపాల కాంతులు విరజిమ్మే ఈ వేడుకను సరికొత్తగా చేసుకునేందుకు వింతవింత దీపాలు వస్తున్నాయి.
Diwali lights | దీపావళి అంటేనే.. సిరుల తల్లికి పూజలు, టపాసుల జోరులు, వెలుగులీనే ముస్తాబులు. ఊరూ వాడా దీపాల కాంతులు విరజిమ్మే ఈ వేడుకను సరికొత్తగా చేసుకునేందుకు వింతవింత దీపాలు వస్తున్నాయి. మంచు ముక్కలా, ముచ్చటైన బొమ్మలా, అందమైన పువ్వులా.. చిత్రంగా కనిపించే ఈ దీపాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి.

మంచు ముక్కను వెలిగిద్దాం!
సాధారణంగా మంచూ మంటా ఒక దగ్గర ఇమడటం అన్నది జరిగే పని కాదు. కానీ మంచు ముక్కనే దీపావళి దివ్వెగా వెలిగిస్తే ఎలా ఉంటుందన్న వినూత్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే ‘ఐస్‌క్యూబ్ దియాస్’ లేదా ‘ఐస్ క్యూబ్ సెంటెడ్ క్యాండిల్స్’. పూర్తి పారదర్శకంగా ఉండే జెల్ వ్యాక్స్‌తో వీటిని తయారు చేస్తారు. చూసేందుకు మంచు ముక్కలా గట్టిగా కనిపించినా.. ముట్టుకుంటే మాత్రం మెత్తమెత్తగా జెల్లీలా ఉంటాయి. ఇవి మామూలు కొవ్వొత్తుల కన్నా ఎక్కువసేపు వెలుగుతాయి. వెలుగుతున్నంతసేపు హాయిగొలిపే సువాసనను వెదజల్లడం వీటి ప్రత్యేకత. ఇంకేం, ఈ దీపావళికి మంచు ముక్కను వెలిగించేయండి. ఆ వింతకాంతులను కండ్లారా ఆస్వాదించండి.

ఇత్తడి పూలు..
దీపారాధనకు ఇత్తడి కుందులనే ఇష్టపడతారు చాలామంది. దీనికి అనేక కారణాలు. చూసేందుకు బావుంటాయి. శుభ్ర పరచుకోవడం సులభం. అయితే వీటిని కూడా పండుగలూ, వేడుకలప్పుడు పూజా మందిరం అలంకరణకు ఉపయోగించుకునేలా చూడచక్కని రంగుల్లో, కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు తయారీదారులు. ‘లోటస్ షేప్డ్ బ్రేస్ దియా’ల పేరుతో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. తామర పువ్వులా రేకులు రేకులుగా ఉంటాయివి. గులాబీ, నీలం, నారింజ రంగులతో పాటు పంచవర్ణాలు వన్నెలీనేలా తయారవుతున్నాయి. దీపావళి ముస్తాబుకు చక్కగా నప్పుతాయి. అంతేకాదు, అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. ఇంకేం, కమలవాసిని అయిన లక్ష్మీదేవిని తామరపూల దీపంతో ఆహ్వానించండి.

బొమ్మల దివ్వెలు
దీపాల పండుగకు బొమ్మల కొలువు పెట్టుకునే సంప్రదాయం చాలా ఇండ్లలో ఉంటుంది. ఇక, వేడుకలో భాగంగా ఇంటిని అలంకరించేటప్పుడు దీపాలతో పాటు రకరకాల బొమ్మలనూ చేరుస్తారు. ఇలా వేడుకలో బొమ్మలూ భాగం అవుతున్నాయి. అందుకే ఇటు ముస్తాబుకు పనికొచ్చేలా, అటు కొత్తగా కనిపించేలా బొమ్మల దీపాలు వస్తున్నాయి. ‘ఫ్యాబ్రిక్ పపెట్ దియాస్’కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఈ వస్త్రపు బొమ్మలు రంగురంగుల్లో అందంగా తయారవుతున్నాయి. వీటితో పాటు ఎల్యీడీ బల్బులు ఉంటాయి. దీనివల్ల, బొమ్మకు దీపం అంటుకుంటుందన్న బాధ లేదు. గాలి తగిలే చోట పెట్టకూడదన్న ఇబ్బందీ లేదు. హాలు, లివింగ్ రూమ్, ప్రధాన ద్వారం.. నచ్చిన చోట పెట్టుకోవచ్చు. దీపావళికి కొత్త కళ తీసుకురావచ్చు.

Read More :
“2023 నుంచి దీపావళి రోజున న్యూయార్క్‌లో స్కూళ్లకు సెలవు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

