Diwali Harathi | దీపావళి నాడు ఆడపడుచులు ఇంట్లో వాళ్లకు హారతులు ఎందుకు ఇస్తారు?

నీరాజయేయుర్దేవాంశ్చ విప్రాన్గాంశ్చ తురంగమాన్
జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ జఘన్యాంశ్చ మాతృముఖ్యాశ్చ యోషితః
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు నీరాజనం (హారతులు) ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది. దీపావళి సందర్భంగా అపమృత్యుదోషం నశించడం కోసం నరకాధిపతి యముడి ప్రీత్యర్థం దీపదానం కూడా చేస్తారు. తర్వాత అమావాస్య రాత్రి లక్ష్మీపూజ నిర్వహించాలని శాస్త్ర వచనం.
– డా॥ శాస్త్రుల రఘుపతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Diwali Special | నరకాసురుడికి అంతశక్తి ఎక్కడిది? అతని పుట్టుక వెనుక ఉన్న చరిత్ర తెలుసా?
Diwali special | ఇంట్లో దక్షిణం వైపు దీపం ఎందుకు పెట్టాలి?
Govardhanotsavam | కార్తీక మాసంలో గోవర్ధన పూజ ఎందుకు చేస్తారో తెలుసా
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

