నిద్రలో కలలు వస్తే మంచిదేనా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు?

Dreams | ‘అసలు మనిషికి నిద్ర అవసరమా? ఆ ఎనిమిది గంటలు కూడా అందుబాటులో ఉంటే ఎంత పని చేసుకోవచ్చో!’ అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఏదో ఓ దశలో వచ్చి తీరుతుంది. నిద్ర వల్ల శరీరానికి విశ్రాంతి దక్కే మాట వాస్తవమే కానీ… అంతకు మించిన ఉపయోగం ఏదైనా ఉందా అన్నదీ తెలుసుకోవాలనుకున్నారు జపాన్ పరిశోధకులు. ఇందుకోసం ఎలుకల మెదడులోకి రంగుల రసాయనాలను ఎక్కించారు. అలా, వాటి మెదడులో రక్తప్రసరణ తీరును కనుగొనే ప్రయత్నం చేశారు. ఫలితాలు ఆశ్చర్యకరం!
మన మెలకువకూ… ఆదమరచి నిద్రలోకి జారుకునే స్థితికీ మధ్య Rapid Eye Movement (REM) అనే దశ ఒకటి ఉంటుంది. మనం కలలు కనేది కూడా ఆ సమయంలోనే. REM దశలో మెదడులోని రక్తనాళాలు చాలా చురుగ్గా ఉండటాన్ని గమనించారు. తద్వారా, అవి మెదడుకు కావాల్సిన పోషకాలను తీసుకుని, అవసరంలేని వ్యర్థాలను వదిలించుకోవడం గమనించారు. మెదడు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండటానికి నిద్ర చాలా ఉపయోగపడుతుందని ఈ పరిశోధనతో తేలిపోయింది. ఈ అధ్యయనం అల్జీమర్స్ లాంటి సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఆలస్యం ఎందుకు? మీ జీవనశైలిలో నిద్రకు సమయం ఇవ్వండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Alzheimers : వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
Health Tips |శృంగారంలో పాల్గొనడం ఒక్కసారిగా ఆపేస్తే అంత ప్రమాదామా?
మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Alzheimers
- dementia
- dreams
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

