కరెంట్ మీటర్
ఇటీవల జరిగిన తాజా అంశాలపై కొన్ని ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చాం. ఇది పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. చదువుకోండి.
1) కేంద్ర ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీతో ఎన్నేండ్లు పూర్తి చేసుకున్నది?
2) జాతీయ గణాంక సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘జాతీయ గృహ ప్రయాణ సర్వే 2025-26’ ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతశాతం మంది ఉద్యోగులు, కార్మికులు పనిప్రదేశాలకు వెళ్లడానికి ద్విచక్రవాహనాలపైన ఆధారపడుతున్నారు?
3) ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరేమిటి?
4) గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఉమ్మడి పౌర స్మృతి’బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. కాగా ఇప్పటివరకు యూసీసీని అమలు చేస్తున్న రాష్ర్టాల్లో గుజరాత్ ఎన్నోది?
5) మెదడుకు సంబంధించిన పలు అంతుచిక్కని అంశాల గుట్టు విప్పేందుకు దోహదపడే కీలక పరిశోధనలు చేపట్టిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. వారి పేర్లేమిటి?
6) ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ వైవిధ్యభరితమైన కథలతో సినీప్రియుల్ని మెప్పించిన టాలీవుడ్ దర్శక మాంత్రికుడు ఇటీవల వృద్ధాప్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆ డైరెక్టర్ పేరేమిటి?
7) వాతావరణ మార్పుల నియంత్రణ, పారిస్ ఒప్పందం అమలు, వాతావరణ నిధులు తదితర అంశాలపై ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించే ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ముసాయిదా సదస్సు 31వ ఎడిషన్ ఏ దేశంలో జరగనుంది?

Turkiye
8) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లద్దాఖ్లోని ఎన్ని ప్రాంతాలను భారత భూభాగంలోని అంశాలుగా గుర్తించి సర్వే ఆఫ్ ఇండియా అధికారిక పటంలో చేర్చుతున్నట్లు ప్రకటించింది?
9) ఇటీవల జపాన్లో నిర్వహించిన ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్ ఎన్ని పతకాలను సాధించింది?
10) కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నూతన చైర్పర్సన్గా నియామకమైన వ్యక్తి పేరేమిటి?
సమాధానాలు
1. వందేండ్లు
2. 42.6 శాతం
3. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
4. రెండోది
5. కార్ల్ డైసరోథ్, పీటర్ హెగెమన్, జార్జ్ నగెల్
6. సింగీతం శ్రీనివాసరావు (95)
7. తుర్కియే
8. 28
9. 85 పతకాలు (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు)
10. మన్దీప్ కె భండారి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

