డివైజ్‌లో కరెక్ట్ టైమ్‌ను ఇన్స్పెక్టర్ రుద్ర ఎంటర్ చేయడంతో రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్’ ముగిసిపోయినట్టు స్క్రీన్‌పై మెసేజీ వచ్చింది. దాంతో పాటు ‘మూడో డివైజ్ ప్రాణం.. చిన్న పెట్టెలో’ అని రాసిఉంది.అందేంటో అర్థంకాలేదు రుద్రకు. తొలి దశ ‘సూసైడ్ వెపన్’ను, రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్’నునిలువరించిన తనకు ఇప్పుడు ఈ మూడో దశ బయోకెమీ క్రియేచర్ పెద్ద సవాల్‌గా మారబోతుందని ఆ మెసేజీని బట్టి రుద్రకు ఈజీగా అర్థమయ్యింది. మూ
డో దశకు సంబంధించిన గుట్టు ఇటలీలో అసలు ఎక్కడ ఉన్నది? ఇండియాలో ఈ దశ చేసే ఘోరకలి ఏంటి? అనేది ఆలోచించిన రుద్ర బుర్ర ఫుల్లుగా వేడెక్కిపోయింది. ఇంతలో కలుగజేసుకొన్న కరణ్.. ‘రుద్ర.. ఇప్పుడు మనం ఇటలీకి బయల్దేరాలా?’ అంటూ అడిగాడు. అందరూ రుద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. మునుపటి దశలో సర్వం కోల్పోయిన వారిని గుర్తు చేసుకొని ఒకింత ఉద్వేగానికి గురైన రుద్ర.. తనలో తాను తమాయించుకొని మాట్లాడటం మొదలు పెట్టాడు. ‘మిషన్ డోలోలోని దశలను ఆపాడానికంటూ మనం ప్రపంచ దేశాలను తిరుగడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీరే ఆలోచించండి. తొలి దశ ‘సూసైడ్ వెపన్’ వల్ల మెట్రో సిటీల్లో పదుల సంఖ్యలో పౌరులకు గాయాలైతే, రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్’కు వచ్చే సరికి ఇది 10,48,576 మందికి చేరింది. ఇప్పుడు మనం ‘బయోకెమీ క్రియేచర్’ దశను ఆపడానికంటూ ఇటలీకి వెళ్లేసరికి ఈ దేశమే పెద్ద శ్మశానంగా మారొచ్చు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ అది జరుగనివ్వను’ అంటూ రుద్ర భావోద్వేగంతో కూలబడ్డాడు. దగ్గరకు వచ్చిన జయ, రామస్వామి, కరణ్, స్నేహిల్.. రుద్రను ఓదార్చారు. దూరంగా చూస్తూ నిలబడ్డాడు హరిశ్వ. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు పైకి లేచిన రుద్ర మళ్లీ మాట్లాడటం కొనసాగించాడు.
‘మీరు గమనించారో లేదో.. ‘హ్యూమన్ షీల్డ్’ దశను ఆపడానికి అవసరమైన క్లూ.. ఆ దశ ప్రారంభమయ్యాకే మనకు దొరికింది’ అంటూ డ్రోన్ నుంచి జారిపడ్డ చీటీ ఘటనను గుర్తు చేశాడు రుద్ర. దీనికి అందరూ అవునన్నట్టు తలూపారు. ఇంతలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘అంటే సార్.. బయోకెమీ క్రియేచర్ దశ ప్రారంభమయ్యాకే.. మనకు క్లూ దొరుకుతుందా? దాని సాయంతో మనం ఇటలీకి వెళ్లి, ఆ డివైజ్‌ను డీయాక్టివేట్ చెయ్యాలా?’ అంటూ ఆందోళనగా అడిగాడు. దానికి రుద్ర మాట్లాడుతూ.. ‘అవును. బాబాయ్.. మూడో దశ ప్రారంభమయ్యాకే, మనకు ఆ క్లూ దొరుకుతుందని నేను అనుకొంటున్నా. ఒకవేళ అదే జరిగితే, మనం ఎవ్వరం బతకం’ అంటూ రుద్ర బాంబు పేల్చాడు. అదెలాగా? అంటూ అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా.. రుద్ర మళ్లీ కొనసాగించాడు. ‘మీకు గుర్తుందో లేదో.. ‘కరోనాతో పోలిస్తే.. బయోకెమీ క్రియేచర్ దశ అంతకు కోటి రెట్ల శక్తిమంతమైంది’ అంటూ డోలో ఈ దశ గురించి మనల్ని ముందే హెచ్చరించాడు. నా అనుమానం నిజమైతే, ఇది ఓ భయంకరమైన సూక్ష్మజీవి చేసే వినాశనానికి సంబంధించినదై ఉంటుంది’ అంటూ రుద్ర ఇంకా ఏదో చెప్పబోతుండగా.. మధ్యలో కలుగజేసుకొన్న హరిశ్వ.. ‘మరి, ఈ దశను ఎలా ఆపగలం సార్?’ అంటూ అడిగాడు. దీంతో ఏదో మెదడులో మెరిసినట్టు రుద్రకు అనిపించింది. అంతే, ఆ వెంటనే.. హరిశ్వను దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు.
‘హరిశ్వ.. ఈ మూడో దశను ఆపాలంటే నీ సాయం మాకు కావాలి’ అన్నాడు రుద్ర. అర్థంకానట్టు చూస్తుండిపోయాడు హరిశ్వ. రుద్ర కొనసాగిస్తూ.. ‘నీకు అర్థమయ్యేలా చెప్తా విను హరిశ్వ. మిషన్ డోలోలో ఒక దశ ఇంకో దశకు లింక్ అయ్యి ఉన్నదని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. తొలి దశ ‘సూసైడ్ వెపన్’ ఎండ్ కాగానే, రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్’ యాక్టివేట్ అయ్యింది. అంటే, ఒక్కో దశకు మధ్య డివైజ్‌ల ద్వారా ఇంటర్నల్ కమ్యూనికేషన్ బదిలీ అవుతున్నట్టేగా’ అంటూ రుద్ర అనగానే.. అవునన్నట్టు తలూపాడు హరిశ్వ. ‘ఎగ్జాక్ట్లీ.. ఇప్పుడు రెండో దశ ఎండ్ అయ్యింది. అంటే, మూడో దశ బయోకెమీ క్రియేచర్కు సంబంధించిన డివైజ్ అక్కడ యాక్టివేట్ అయినట్టేగా. అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండో దశ డివైజ్ నుంచి ఈ సిగ్నల్ ఇక్కడి నుంచి ఇటలీలో ఏ ప్రాంతానికి వెళ్లిందో కనిపెడితే, అక్కడ మూడో దశకు సంబంధించిన డివైజ్ ఉన్నట్టేగా. నువ్వు ఆ మూడో దశ డివైజ్‌ను కనిపెట్టగలవా?’ అని రుద్ర పూర్తిచేయకముందే.. ‘ఎస్’ అంటూ ఆ డివైజ్ లొకేషన్‌ను ఇటలీలో ఎగ్జాక్ట్‌గా కనిపెట్టాడు హరిశ్వ. అంతేకాదు, ఇప్పటికే ఆ డివైజ్ యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లి అరగంట దాటినట్టు చెప్పాడు. అంతే, రుద్రతో పాటు మిగతా టీమ్ మెంబర్స్ కింద భూకంపం వచ్చినంత పనైంది.
ఆ వెంటనే తేరుకొన్న రుద్ర.. బయోకెమీ క్రియేచర్ దశ స్టార్టయ్యి అరగంట అయ్యిందని, దాని ప్రభావం దేశంలో ఎలా ఉందంటూ సమాచారం తెప్పించుకొన్నాడు. అయితే, ఎక్కడా ఏ కొత్త దశ ప్రారంభమైనట్టు తమకు సమాచారం లేదంటూ సంబంధిత వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో తాము కరెక్ట్ మార్గంలోనే ఆలోచిస్తున్నామా? అంటూ రుద్ర అండ్ కో కూలబడిపోయారు. ఇంతలో రెండో దశకు సంబంధించి డివైజ్‌లో డిస్ప్లే అయిన మెసేజీ గుర్తొచ్చి వెంటనే అధికారులను ఫోన్లో అప్రమత్తం చేశాడు రుద్ర. ఇంతకీ, డివైజ్ యాక్టివేట్ అయినా మూడో దశ ఎందుకు స్టార్ట్ కాలేదు? రెండో దశ డివైజ్‌లోని డిస్ప్లే మెసేజీని బట్టి రుద్రకు ఏం అర్థమయ్యిందో మీరు కనిపెట్టారా?
సమాధానం:
రెండో దశ డివైజ్ స్క్రీన్‌పై కనిపించిన మెసేజీలో ‘మూడో డివైజ్ ప్రాణం చిన్న పెట్టెలో’ అని రాసి ఉంది. అంటే, మూడో దశ డివైజ్ యాక్టివేట్ అయినప్పటికీ బయోకెమీ క్రియేచర్ దశ మాత్రం యాక్టివేట్ కాదు. ఎందుకంటే, డివైజ్ యాక్టివేట్ అయ్యాక.. బయోకెమీ క్రియేచర్ వైరస్ ఉన్న ఆ పెట్టెను ఎవరైనా ఓపెన్ చేయాలి. అప్పుడే, అందులోని వైరస్ బయటకు వచ్చి వాయువేగంతో అందరికీ సోకుతుంది. అయితే, ఇప్పటివరకూ ఆ పెట్టెను ఎవ్వరూ ఓపెన్ చేయలేదు కాబట్టే, డివైజ్‌లో మూడో దశ ప్రారంభమై ఆరగంట అయినట్టు టైమ్ చూయించినా.. బయోకెమీ క్రియేచర్ ప్రభావం ఇంకా ఎవరిపై పడలేదు. అది కనిపెట్టిన రుద్ర.. ఎవ్వరూ ఓపెన్ చెయ్యకముందే ఆ పెట్టె ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ హరిశ్వను పురమాయించాడు. …? రాజశేఖర్ కడవేర్గు