ఒకటో రోజు ఓనగాయ ఒక్కచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
రెండో రోజు రొట్టె నీకు రెండుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
మూడో రోజు ముద్ద నీకు మూడుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
నాలుగో రోజు నానబియ్యం నాలుగుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఐదోరోజు అట్లు నీకు ఐదుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఆరో రోజు అర్రెం నీకు ఆరుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఏడో రోజు వేపకాయ ఏడుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఎనిమిదో రోజు న్నముద్ద ఎనిమిదిచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
తొమ్మిదో రోజు సద్దుల్నీకు తొమ్మిది చుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
అందమైన మఖమల్ గుడ్డలు పరిచినా, విలువైన వాల్పేపర్లు, రంగురంగుల బొమ్మలతో గోడలను అలంకరించినా.. ప్రేమకు చోటులేని ఇల్లు నిరుపేదదే.
-హెర్మన్ హెస్(జర్మన్- స్విస్ సాహితీవేత్త)