చూస్తే కేక్… కోస్తే ఐస్‌క్రీమ్!
కాలమేదైనా ఐస్‌క్రీమ్ అనగానే మనసు మంచులా కరిగిపోతుంది. అందుకే ఎన్ని ఫ్లేవర్లు తిన్నా మరో కొత్త రుచి కోసం ఎదురు చూస్తుంటారు.
కాలమేదైనా ఐస్‌క్రీమ్ అనగానే మనసు మంచులా కరిగిపోతుంది. అందుకే ఎన్ని ఫ్లేవర్లు తిన్నా మరో కొత్త రుచి కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లకోసం రూపొందుతున్నవే ఐస్‌క్రీమ్ కేకులు. ఐస్‌క్రీమ్ చుట్టూ కేకు ఉండటం, దాన్ని కేకు ముక్కలా కోసి తినడం ఇందులోని ప్రత్యేకత.
చింటూకు ఐస్‌క్రీమ్ ఇష్టం. కేకు కూడా ఇష్టమే. బజారుకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తీసుకొమ్మంటే.. రెండూ కావాలని గోల చేస్తున్నాడు. అప్పుడు ఐస్‌క్రీమ్ కేక్‌ను ముందుంచాడు వెయిటర్. గుండ్రటి స్పాంజి కేకు ముక్క మధ్యలో టూటీ ఫ్రూటీలతో కలిసిన వెనీలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అది. చూడగానే చింటూ కళ్లు మంచు ముక్కల్లా మెరిశాయి. ఒక్క చింటూకే కాదు కేకుతో కలిసి డబుల్ ఢమాకా కింద దొరుకుతున్న ఈ ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు చాలా మందికి నచ్చుతున్నాయి. ఎంత ఇష్టమైనా ఐస్‌క్రీమ్‌ను ఒకే ఫ్లేవర్‌తో తినడం బోరింగ్‌గానే ఉంటుంది.
అదే విభిన్న ఫ్లేవర్ల కలగలుపుగా ఉంటే నాలుగు రకాల కూరలతో భోంచేసినంత తృప్తిగా అనిపిస్తుంది. ఆ కోరిక కూడా తీరేలా కసాటా కేక్ ఐస్‌క్రీమ్‌లు తయారవుతున్నాయి. చూసేందుకు అచ్చం కేకులా కనిపించే దీన్ని కట్ చేస్తే లోపల రెండు మూడు రకాల ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌లు ఉండటం ఈ రకం ప్రత్యేకత. దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు ఉన్నాయి. కొన్ని ప్రముఖ ఐస్ క్రీమ్ సంస్థలు కూడా తమదైన రుచితో వీటిని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మీరూ ఓసారి రుచి చూసేయండి మరి! మీరే అనేస్తారిలా.. కేకైస్ కేక!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

