ఈ పాప మాములుది కాదండోయ్ .. 9 నెలలకే కుంచెపట్టి పెయింటింగ్‌లు.. నాలుగేండ్లకే అవార్డులు..

aelita andre |చిన్నపిల్లలకు చదవడం, రాయడం కంటే బొమ్మలేయడమే ఇష్టం. రంగులద్దడమంటే మహా సరదా. ముద్దు ముద్దుగా ‘మమ్మీ.. డాడీ..’ అని పలకడానికి ముందే కుంచె పట్టి బొమ్మలేయడం ప్రారంభించింది ఆస్ట్రేలియాకు చెందిన అలిటా ఆండ్రీ. తొమ్మిది నెలల వయసులో కుంచెపట్టిన ఈ పిల్ల పికాసో గురించి తెలుసుకుందామా..
అలిటా ఆండ్రీ.. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా వందమంది ఉత్తమ చిత్రకారుల జాబితాలో చోటు సంపాదించుకున్న చిన్నారి. పదమూడేండ్ల అలిటా పుట్టిన తొమ్మిది నెలలకే తండ్రి మైఖెల్తో కలిసి కాన్వాస్‌పై రంగులద్దేందుకు ప్రయత్నించేదట. అలిటా ఆసక్తిని గమనించిన తండ్రి ఆమె చేతికి కుంచె అందించాడు. అది మొదలు, వర్ణాలే తన ప్రపంచం అయ్యాయి. ఏడాదిన్నర వయసులోనే లండన్ ఆర్ట్ గ్యాలరీలో అలిటా మొదటి చిత్రాన్ని ప్రదర్శించారు.
నాలుగేండ్లకే ‘సప్త వర్ణాల బాల మేధావి’ పేరున తన చిత్రాలతో ప్రదర్శన నిర్వహించిందీ చిన్నారి. మూడు వారాలపాటు జరిగిన ఆ ప్రదర్శనలో అలిటా వేసిన 24 చిత్రాలు నాలుగు వేల నుంచి పది వేల డాలర్లు పలికాయి. విమర్శకులు సైతం ‘యంగ్ పికాసో’ అని పొగిడేలా చేశాయి. 2016లో ‘యంగెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్’ అవార్డుకు ఎంపికైన ఈ చిన్నారి చిత్రాలను ‘రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ మ్యూజియంలో ప్రదర్శించారు. ప్రకృతికి సంబంధించిన లోతైన భావాలను కాన్వాస్‌పై అద్దుతూ అందరి మన్ననలూ పొందుతున్న ఈ చిన్నారికి మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
hire a chef | టైం చెప్తే చాలు.. ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ ఇంటికొచ్చి వంట చేసి వెళ్తాడు
మీ పాత సైకిలు..ఒకరికి కొత్త జీవితం!
పిల్లలు ఎక్కడ సంతోషంగా ఉంటారు? అమ్మ దగ్గరా? అమ్మమ్మ, నానమ్మల దగ్గరా?
hildren Health | చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

