మీ పాత సైకిలు..ఒకరికి కొత్త జీవితం!
సైకిలు.. సామాన్యుడి వాహనం. సంపన్నుడి వ్యాయామ సాధనం. ఓ పేద వ్యాపారికి ఖరీదైన పెట్టుబడి. పట్టణంలోని బడికెళ్లే గ్రామీణ విద్యార్థికి సరస్వతీ కటాక్షం. ఆ రెండు చక్రాల బండికి ఎప్పుడూ అల్పాయువే. ఆర్థిక స్తోమత పెరిగిపోగానే.. అప్పటివరకూ సవారీ సేవలు అందించినదాన్ని తీసుకెళ్లి మూలన పడేస్తారు. ఆ స్థానంలో ఏ బైకో, కారో వస్తుంది. ‘మీరు అటకెక్కించిన ఆ డొక్కుసైకిలును మాకివ్వండి, డొక్కలెండిన బతుకులకు మీ కానుకగా మేమిస్తాం’ అంటున్నారు ఇద్దరు యువకులు.

నగరాల్లో అందరూ బైక్‌ల మీదో, కార్లలోనే తిరుగుతారని అనుకుంటే పొరపాటే. బస్సుల్లో తిరిగేందుకు కూడా పైసల్లేక కాలినడకన కూలీ పనులకు వెళ్లేవారు ఎంతోమంది. అలాంటి వాళ్లకు తమ వంతు బాధ్యతగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మిత్రులు. ఆ ప్రయత్నంలో భాగంగా ‘హ్యాపీ హైదరాబాద్’ గ్రూప్‌ను ప్రారంభించారు. మూలకు పడిన పాత సైకిళ్లను సేకరించి, వాటిని బాగు చేసి అవసరమైన పేదలకు అందిస్తున్నారు. ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొని, తమవద్ద ఉన్న పాత సైకిళ్లను అందించాలని అభ్యర్థిస్తున్నారు ‘హ్యాపీ హైదరాబాద్’ కో-ఫౌండర్ శంతన సెల్వన్.
వెలుగునిచ్చే ‘దియా’..
మన చుట్టూ చాలామంది సైకిల్ కూడా కొనలేని స్థితుల్లో ఉంటారు. అలాంటి వారికోసమే ప్రాజెక్ట్ దియా. వాడకుండా మూలన పడేసిన సైకిళ్లనే మాకు ఇవ్వమని కోరుతున్నాం. అలా వచ్చినవాటిని మా సొంత డబ్బుతో బాగు చేయించి, అవసరమైన వాళ్లకు అందజేస్తున్నాం. ఇప్పటివరకు యాభై సైకిళ్లను సేకరించాం. వాటిలో 25 సైకిళ్లను పాల ప్యాకెట్లు, పేపర్లు వేసేవాళ్లకు, చిరువ్యాపారులకు ఇచ్చాం. పాత సైకిలు అందుకుంటున్నప్పుడు ఆ కండ్లలో కొత్త వెలుగులు కనిపిస్తాయి. ఓ తీవ్ర సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆనందమది. ‘దియా’ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. కొంతమంది అవసరం లేకపోయినా సరే, సెంటిమెంటుగా ఇంట్లోనే పెట్టుకొంటున్నారు. ఓ మూలన పడేస్తున్నారు. ఆ సైకిలు మీకొక జ్ఞాపకం మాత్రమే. కానీ చాలామందికి అదే జీవితం. ఒక కుటుంబానికి ఆధారం. ఈ కోణంలోంచి చూడమని నేను అభ్యర్థిస్తున్నాను’ అంటాడు సెల్వన్. ‘మాకు సైకిల్ కొనేంత స్తోమత లేదు. మీరు సైకిల్ ఇస్తే పనులు చేసుకుని బతుకుతాం’ అంటూ అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. కానీ, ఆ మేరకు దాతల నుంచి సైకిళ్లు అందడం లేదు. ఖ్యంగా పెద్ద సైకిళ్లు ఇస్తే పూలు, ఆకుకూరలు, టిఫిన్లు అమ్ముకొనేవారికి ఉపయోగకరంగా ఉంటాయి’ అంటూ ప్రస్తుత పరిస్థితిని
వివరిస్తారు.
సైక్లింగ్‌తో మొదలు..
‘నేను ఒక ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తున్నాను. సైక్లింగ్ నాకు ఒక వ్యాపకంగా మొదలై అభిరుచిగా మారిపోయింది. వివిధ సైక్లింగ్ గ్రూపుల్లో చేరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ప్రస్తుతం ‘హైదరాబాద్ బైసికిల్’ మేయర్‌గా వ్యవహరిస్తున్నా. సిటీలోని సైక్లింగ్ గ్రూపులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి, ‘సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్’ ఏర్పాటు చేశాను. అయితే నేను, దినేశ్సేల్ కలిసి సైక్లింగ్ని ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫేస్బుక్లో మా గ్రూప్ సభ్యుల సంఖ్య వేలల్లో ఉంది. అవసరం ఉన్నవాళ్లకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ దియా’ను
ప్రారంభించాం.
సైక్లింగ్ మిత్రడు దినేశ్‌తో
శంతన సెల్వన్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

