దూర్వయుగ్మ పూజ

వినాయకునికి గరికపూజ ప్రీతి, కిందినామాలను చదువుతూ ఒక్కో నామానికి రెండు గరికలను స్వామివారికి సమర్పించండి.
ఓం గణాధిపాయ నమః- దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమారగురవే నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః – దూర్వాయుగ్మం పూజయామి
మంత్రపుష్పం
అక్షతలు చేతిలో ఉంచుకుని కింది శ్లోకాన్ని చదవండి.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్
ఓం శ్రీ వరసిద్ధి వినాకస్వామినే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
చేతిలోని పూలు, అక్షతలు స్వామివారిపై ఉంచాలి.
ప్రదక్షిణ
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మ
ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి.
పునః అర్ఘ్యం
పుష్పంతో నీళ్లు సమర్పించాలి.
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన
పువ్వులు, అక్షతలు తీసుకోవాలి. కింది శ్లోకాన్ని
చదివి గణనాథుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి.
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక
ఈప్సితంమే వరందేహి పరిత్ర చ పరాంగితమ్
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశా
పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి
సర్వోపచారాలు
అక్షింతలు స్వామివారి పాదాల వద్ద వేయండి. ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ఛత్రమాచ్చాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, ఆందోళికానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.
క్షమా ప్రార్థన
చేతిలో అక్షతలు తీసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని కింది శ్లోకాన్ని చదివాక ఒక పళ్లెంలో వదలాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ అష్టోత్తర శతనామార్చనాయచ, అవసర, మహానివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
చివరగా స్వామివారి ముందున్న పూజాక్షతలను పెద్దలు తమ శిరస్సుపై వేసుకొని, కుటుంబసభ్యులందరిపై వేయాలి. తర్వాత చేతిలో అక్షతలు ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

