కొత్తకొత్త ట్రెండ్స్‌కు నాంది పలుకుతున్న బేకర్స్

ఒకప్పుడు, బేకరీ ఐటమ్స్ చేయడం అంటేనే తలనొప్పి. కానీ ఇప్పుడు, కావాల్సిన పదార్థాలన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇంటర్నెట్లోనూ మేకింగ్ వీడియోలు పుష్కలంగా లభిస్తున్నాయి.దీంతో చాలామంది ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఫలితంగా, బేకరీల వ్యాపారం మందగించడం మొదలుపెట్టింది.ఆ సవాలును తట్టుకోవడానికి కొత్తకొత్త ట్రెండ్స్‌కు నాంది పలుకుతున్నారు.
సులభంగా, వేగంగా!
బేకింగ్ అంటే గంటల తరబడి కష్టపడాల్సిందేనని అనుకుంటారు. నిజానికి కేక్ బేక్ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇందుకు పరిష్కారం ‘షీట్ కేక్’. ఇది వెడల్పుగా ఉంటుంది. ఎత్తు మాత్రం తక్కువే. ఫలితంగా, బేకింగ్ సమయం తగ్గుతుంది. కేకు నాణ్యతా బాగుంటుంది.
పిండిలో మార్పు!
2020 వరకు బేకింగ్‌లో ఒకటి, రెండు రకాల పిండినే వాడేవాళ్లు. కానీ ఇప్పుడు కొబ్బరి పిండి, అరటి పిండి.. ఇలా చాలా వస్తున్నాయి. సూపర్ మార్కెట్లో కూడా రకరకాల బేకింగ్ ఫ్లోర్స్ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వైవిధ్యం పెరిగింది. సహజంగానే రుచీ పెరుగుతుంది.

ఆరోగ్యమూ ముఖ్యమే
కొన్ని బేకరీ పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొవ్వు శాతం ఎక్కువే. మైదా పెత్తనమూ అధికమే. కానీ, మారుతున్న పరిస్థితుల్లో జనం ఆరోగ్యానికి ఉపకరించే దినుసులను ఎంచుకొంటున్నారు. అలర్జీలు కలిగించని రకాలనే వాడుతున్నారు.తాజా మొక్కలకు, కూరగాయలకు పెద్దపీట వేస్తున్నారు.
కొత్తకొత్తగా: బేకర్స్ రకరకాల ప్రయోగాలతో కస్టమర్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. స్వీట్ అండ్ సాల్టీగానే కాదు, వింతవింత కాంబినేషన్స్‌తో కొత్తరుచిని తీసుకొస్తున్నారు. రంగు, రుచి, వాసన, ఆకారం.. సరికొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు.

వైవిధ్యం ‘పాలు’ ఎక్కువే: బేకింగ్‌లో పాల ఉత్పత్తులు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే కేవలం పాలను మాత్రమే కాకుండా వివిధ డెయిరీ ప్రొడక్ట్స్ కలిపి బేక్ చేయడం ట్రెండ్‌గా మారింది. ప్రత్యేకంగా, ఏఏ పదార్థాలు వాడాలో చెప్పి కేక్స్ తయారు చేయించుకునే అవకాశమూ ఇస్తున్నారు బేకరీల నిర్వాహకులు.
పాశ్చాత్య ప్రభావం: కుంకుమ పువ్వు, దానిమ్మ మొదలైనవాటిని పాశ్చాత్య బేకర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దాంతో వాళ్ల కేక్స్, స్వీట్లు రుచిగా, వైవిధ్యంగా ఉంటాయి. కొంతకాలంగా, మన బేకర్స్ కూడా అలాంటి పదార్థాలను విరివిగా ఉపయోగిస్తున్నారు.

Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

