స్కిల్డ్ ఉద్యోగులు కావాలా నాయనా..
నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే సంస్థలకు వెన్నెముక. భారీ ప్రాజెక్టులు దొరకబుచ్చు కోవడం కన్నా.. సరైన మానవ వనరులను ఒడిసి పట్టుకోవడమే సవాలు.
నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే సంస్థలకు వెన్నెముక. భారీ ప్రాజెక్టులు దొరకబుచ్చు కోవడం కన్నా.. సరైన మానవ వనరులను ఒడిసి పట్టుకోవడమే సవాలు. అందుకే రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను ప్రత్యేక సంస్థలకు అప్పగిస్తుంటాయి బడా కంపెనీలు. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నది వనపర్తి బిడ్డ మేఘన. బహుళజాతి సంస్థలకు మన్నికైన మానవ వనరులు అందించే లక్ష్యంతో మేఘన ‘యశస్వి హెచ్ఆర్ కన్సల్టెన్సీ’ని స్థాపించింది.
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం అడ్డాగా మొదలైన ఈ సంస్థ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 200కు పైగా ఐటీ, ఇతర సంస్థలకు నిపుణులైన మానవ వనరులను అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగులకు ఉపాధియోగం అందిస్తూనే, వ్యాపార సంస్థలకు విజయాన్ని కట్టబెడుతున్న ఆంత్రప్రెన్యూర్ మేఘన ఈ వారం మన స్టార్టప్ స్టార్..
మాది వనపర్తి. మా కుటుంబసభ్యులంతా వైద్యరంగంలో స్థిరపడినవారే. వారికి భిన్నంగా నేను కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. తర్వాత ఎంబీఏ చదివాను. అందులో హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఎంచుకున్నాను. చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయడం కన్నా.. సొంతంగా ఒక వ్యవస్థను నెలకొల్పి.. పదిమందికీ ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉండేది. అది ఒక్కసారిగా నెరవేరేది కాదని నాకు తెలుసు. అందుకే ఎంబీఏ పూర్తయ్యాక ఒక సాధారణ ఉద్యోగిగా నా ప్రయాణం మొదలుపెట్టాను. వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ మేనేజర్ స్థాయికి ఎదిగాను. తర్వాత ఆంత్రప్రెన్యూర్‌గా నిలబడేందుకు కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం హెచ్ఆర్ ఫ్రాంచైజీ సంస్థతో కలిసి కొన్నాళ్లు పనిచేశాను.
మలుపు తిప్పిన ఫ్రాంచైజీ..
ఏ రంగంలోనైనా రాణించాలంటే అందుకు తగినన్ని నైపుణ్యాలను ముందుగా పెంపొందించుకోవాలి. అప్పుడే సొంతంగా వ్యవస్థను నిర్మించగలిగే ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతాం. ఈ క్రమంలో నేను కూడా హెచ్ఆర్ సేవలు అందించే ఫ్రాంచైజీని తీసుకున్నాను. దాన్ని నిర్వహించే క్రమంలో వివిధ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆంత్రప్రెన్యూర్‌గా నా కల చిగురింపజేసింది. 2011లో మరో భాగస్వామ్యంతో యశస్వి హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించాను. అప్పటికే నాకు పెళ్లయ్యింది. దాంతో హైదరాబాద్‌లోనే స్థిరపడాలన్న ఉద్దేశంతో సంస్థ బలోపేతానికి నిరంతరం శ్రమించాను.
డిగ్రీ నుంచే..
మహబూబ్‌నగర్ ప్రాంతంలో పేరెన్నికగన్న గైనకాలజిస్టుల్లో మా అమ్మ ఒకరు. నాన్నతోపాటు మా కుటుంబ నేపథ్యం అంతా వైద్యమే! డాక్టర్ కూతురు డాక్టర్ కావాలన్న విధానానికి స్వస్తి చెబుతూ నా దారి మార్చుకున్నాను. డిగ్రీ నుంచే నా లక్ష్యాన్ని చేరుకునేలా దారి నిర్మించుకుంటూ వచ్చాను. కుటుంబ సహకారం, సరైన సమయంలో దొరికిన స్నేహహస్తం, ఏర్పడిన నెట్వర్క్ ఇవన్నీ నేను ఎదగడానికి ఎంతగానో దోహదం చేశాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్, సౌత్ ఆఫ్రికాలోని సంస్థలకు కావాల్సిన నాణ్యమైన ఉద్యోగులను అందించే స్థాయికి చేరుకునేలా ఊతమిచ్చాయి.
సంస్థలకు సవాలే…
ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఈ టెక్ యుగంలో సంస్థలకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం చాలా కీలకం. టెక్నాలజీ సాయంతో ఈ ప్రక్రియ సులభతరమైనా… సంస్థలు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం అనుకున్నంత తేలికైన పనికాదు. మా సంస్థ ప్రారంభించిన మొదటి నెలలోనే ఐటీ సెక్టార్‌కు పదుల సంఖ్యలో టెక్నికల్ మ్యాన్‌పవర్‌ను అందించగలిగాం. క్వాలిటీ మ్యాన్‌పవర్ హంటింగ్‌లో కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. మనల్ని నమ్ముకున్న సంస్థను మోసం చేసినవారం అవుతాం. అందుకే క్వాంటిటీ కన్నా క్వాలిటీ మ్యాన్‌పవర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించాం. మా సంస్థను ఎంతో ఇష్టంతో మొదలుపెట్టి, మరెంతో కష్టంతో కూడుకున్న లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకువెళ్తున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమారు 200 సంస్థలకు మానవ వనరులు సమకూరుస్తూ మా ప్రత్యేకతను చాటుకుంటున్నాం.
– కడార్ల కిరణ్
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

