Usha Chilukuri | జేడీ వాన్స్ ఉషస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని వడ్లూరు ఉషా చిలుకూరి పూర్వీకుల ఊరు. వాళ్ల తాత చిలుకూరి రామశాస్త్రి స్వగ్రామం ఇది.
ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని వడ్లూరు ఉషా చిలుకూరి పూర్వీకుల ఊరు. వాళ్ల తాత చిలుకూరి రామశాస్త్రి స్వగ్రామం ఇది. మద్రాస్ ఐఐటీ స్థాపించినప్పుడు ఆయనకు ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. అలా ఆ కుటుంబం మద్రాస్‌లో స్థిరపడింది. డెబ్బయ్యో దశకం చివరి రోజుల్లో ఉష తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లారు. ఉష అమెరికాలోనే పుట్టి, పెరిగింది.
Usha Chilukuri | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్దగా చెప్పుకోదగ్గ విధానపరమైన చర్చల్లేవు. హామీలూ లేవు. ప్రపంచానికి ఆసక్తీ లేదు. ఎప్పుడైతే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసేందుకు దుండగుడు కాల్పులు జరిపాడో అప్పటినుంచి ఎన్నికల ప్రచారం ఓ మలుపు తిరిగింది. ప్రపంచమూ ఆ ఎన్నికల వైపు చూసింది. కాల్పుల తర్వాత ట్రంప్ గురించే కాదు ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా రంగంలోకి వచ్చాడు. ఈ కాల్పులకు అధ్యక్షుడు బైడెన్‌కి సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన జె.డి. వాన్స్‌ని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ప్రకటించాడు. వాన్స్ తెలుగింటి అల్లుడు కావడంతో భారతీయులూ తన అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి చూపుతున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరి ప్రవాస తెలుగమ్మాయి.
అతనికి ఆమే అండ
ఉష శాండియాగోలోని మిడిల్‌క్లాస్ కమ్యూనిటీలో పెరిగింది. యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చదివింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పూర్తిచేసింది. యేల్ లా స్కూల్లో న్యాయశాస్త్రం చదివేప్పుడు… ‘సోషల్ డిైక్లెన్ ఇన్ వైట్ అమెరికా’ అనే కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ సమయంలో ఉషకు జేడీ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి, పెండ్లికి దారిచూపింది. వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తాడు. ఉష హిందూ మత విశ్వాసాలను ఆచరిస్తుంది. ఉష అమెరికా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దగ్గర కొంతకాలం క్లర్క్‌గా పనిచేసింది.
ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నది. చదువు, ఉద్యోగాల్లో మంచి ప్రతిభ చూపిన ఆమె రాజకీయాల్లో భర్తకు అండగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఉషను యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా ఆమె భర్త అభివర్ణిస్తుంటాడు. ఎందుకని ప్రశ్నించినవాళ్లకు ‘నాకు కూడా తెలియని ప్రశ్నలను ఆమె అర్థం చేసుకుంటుంది’ అని బదులిస్తాడు. ఓహియో సెనేటర్‌గా ఉన్న వాన్స్ పలు ఇంటర్వ్యూల్లో ‘నా భార్యే నా ధైర్యం’ అని చెప్పాడు.
‘నేను ఊహల్లో ఉన్నప్పుడు వాస్తవంలోకి తీసుకొచ్చే గైడ్‌గా ఉష నాకు సాయపడుతుంటుంది’ అని భార్య మేలుని వాన్స్ తలుచుకున్న సందర్భాలు అనేకం. ‘నేను చాలా తెలివైనవాడినని గర్వంగా ఫీలైనప్పుడు ఆమె గుర్తుకొస్తే ఆ గర్వం నీరుగారిపోతుంది. ఎందుకంటే ఆమె నాకంటే తెలివైనది. ఆమె వెయ్యి పేజీల పుస్తకాన్ని కొన్ని గంటల్లోనే చదివేయగలదు’ అని వాన్స్ ఉషను పొగిడిన సందర్భాలెన్నో. ఇప్పుడూ ఎన్నికల సభల్లో, ఇంటర్వ్యూల్లో ఉష తెలివిని, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నాడు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి, జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు అయితే.. అతగాడి నిర్ణయాల్లో ఉషోదయం పొడచూపకుండా ఉండదనేది కాదనలేని వాస్తవం.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

