Truebrowns | ఆన్లైన్లో దుస్తులు ఎప్పుడో అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే వాటిలో మనం కోరిన సైజు లభించడమే కష్టం. కాబట్టే, నేరుగా ఆ విభాగం మీదే దృష్టి పెడుతున్నాయి కొన్ని సంస్థలు. వాటిలో ఒకటి గురుగ్రామ్ కేంద్రంగా నడుస్తున్న ట్రూ బ్రౌన్స్. ఈ సంస్థను ఉదిత బన్సల్ప్రారంభించారు. ఇక్కడ XL, XXL మొదలు 6XL వరకూ వివిధ సైజులు లభిస్తాయి.
ఆఫ్లైన్లో ఔట్లెట్స్ ద్వారా కూడా తమ ఉత్పత్తులను అందిస్తున్నారు ఉదిత. ‘గత ఏడాది వ్యాపారం మూడు రెట్లు పెరగడమే మా విజయానికి సాక్ష్యం’ అంటున్నారామె. ఈ ఆర్థిక సంవత్సరం ఆ ఫలితాలను రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఉదిత నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ టెక్నాలజీలో పట్టా అందుకున్నారు. హార్వర్డ్లోనూ చదివారు. ఆ తర్వాత కొంతకాలం రిటైల్ సంస్థల్లో కీలక బాధ్యతలు పోషించారు. పుట్టిపెరిగింది ఢిల్లీలో. వ్యాపారవేత్తల కుటుంబం కావడంతో పెట్టుబడి పెద్ద కష్టం కాలేదు. ట్రూ బ్రౌన్స్ను నిర్వచించమంటే.. ‘తనను తాను ప్రేమించే భారతీయ మహిళ ఫ్యాషన్ ప్రయాణమే ట్రూ బ్రౌన్స్’ అని ముక్తాయిస్తారు.