ఇది.. దీపిక పదుకోన్ టైమ్
చిదిమి దీపం పెట్టుకోదగిన అందం ఆమెది. అంతకుమించి నటిగానూ ఖ్యాతి గడించింది దీపిక పదుకోన్. గ్లామర్ జోన్ నుంచి బయటికొచ్చి అనేక ప్రయోగాత్మక పాత్రలు చేసింది. ఆ ప్రతిభను గుర్తిస్తూ ‘టైమ్' మ్యాగజైన్ దీపిక ఫొటోను తాజా సంచిక ముఖచిత్రంగా ఎంచుకుంది.
చిదిమి దీపం పెట్టుకోదగిన అందం ఆమెది. అంతకుమించి నటిగానూ ఖ్యాతి గడించింది దీపిక పదుకోన్. గ్లామర్ జోన్ నుంచి బయటికొచ్చి అనేక ప్రయోగాత్మక పాత్రలు చేసింది. ఆ ప్రతిభను గుర్తిస్తూ ‘టైమ్’ మ్యాగజైన్ దీపిక ఫొటోను తాజా సంచిక ముఖచిత్రంగా ఎంచుకుంది. భారతీయ నటీమణులు ఆశగా ఎదురుచూసే అరుదైన అవకాశం ఇది. చాలామంది ఆ కవర్ పేజీని ఫొటోఫ్రేమ్ కట్టించుకుని.. గోడకు అలంకరించుకుంటారు కూడా.
మానసిక ఆరోగ్య చైతన్యానికి చేస్తున్న కృషికిగాను గత ఏడాది ‘టైమ్ 110 ఇంపాక్ట్ట్ అవార్డ్’ కూడా అందుకున్నది దీపిక. ఆస్కార్ అవార్డుల వేదిక మీద.. ప్రెజెంటర్‌గా ‘నాటు.. నాటు’ పాటను పరిచయం చేసిన ఘనతా తనదే. గత ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎనిమిది మంది సభ్యుల జ్యూరీలో ఆమె ఒకరు. దీపిక అనేక అంతర్జాతీయ బ్రాండ్స్‌కు రాయబారి కూడా. ప్రపంచంలోని అత్యంత సౌందర్యరాశుల చిట్టాలోనూ చోటు దక్కించుకుంది. ‘టైమ్’ ముఖచిత్రంతో దీపిక పేరు మరోమారు మారుమోగుతున్నది.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

