మరి కొద్ది గంటల్లో ఎస్ఎస్ఎల్వీ – డీ2 ప్రయోగం.. ఏర్పాట్లు పూర్తి చేసిన ఇస్రో
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 2 స్మాల్ శాటిలైట్ లాంచర్ నింగిలోకి మరికొద్ది గంటల్లో దూసుకెళ్లనుంది.
అమరావతి : తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 2 స్మాల్ శాటిలైట్ లాంచర్ నింగిలోకి మరికొద్ది గంటల్లో దూసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు లాంచర్‌ను ప్రయోగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాకెట్‌కు చివరి విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం తెల్లవారుజాము 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు.
ఈ లాంచర్లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్-01, ఆజాదీశాట్-02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనున్నది. గత సంవత్సరం ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ -డీ1 మిషన్ రాకెట్‌ని రెండవ దశ వేరుచేసే సమయంలో సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలమైంది.
ఆరు నెలల తర్వాత ఎస్ఎస్ఎల్వీ -డీ 2 పేరుతో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టి రేపు రోదసిలోకి రాకెట్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. 34 మీటర్ల పొడవు ,రెండు మీటర్ల వ్యాసం కలిగిన ఈ రాకెట్ 120 టన్నుల లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశిని కలిగి ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

