బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు ఎన్ని- మూడు
1. ఏమి బోధించాలి? -విద్యా ప్రణాళిక
2. ఎందుకు బోధించాలి? -లక్ష్యాలను సాధించడానికి
3. ఎలా బోధించాలి? -బోధనా పద్ధతులు
విద్యా విధానం ముఖ్య ఉద్దేశం
1) విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం
2) విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి తోడ్పడటం
విద్యావిలువలు
నిర్వచనాలు
విలువల లక్షణాలు
1. అమూర్తమైనవి 2. అంతర్లీనమైనవి
3. సాపేక్షమైనవి 4. ఆపాదింపబడేవి
5. నమ్యత కలిగినవి
అమూర్త గమ్యాలనే విలువలు అంటారు.
సాంఘిక శాస్త్ర బోధనా ఆశయాలు
సామాజిక విషయాల గురించి ప్రాథమిక భావనలు అందించడం.
విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించడం.
విద్యార్థుల్లో పౌరసత్వ విలువలను పెంపొందించడం.
ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం.
భారతీయ సంస్కృతిని ప్రశంసించడం.
పర్యావరణంతో పరిచయం కలిగించడం.
సాంఘిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగించడం.
జాతీయ సమైక్యతను పెంపొందించడం.
అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం.
మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం.
ఉద్దేశాలు, విలువలకు మధ్య తేడా
ఉద్దేశం / ఆశయం
1. సాంఘిక శాస్ర్తాన్ని ప్రవేశపెట్టడంలో ఉన్న ఆవశ్యకతను తెలియజేస్తాయి.
2. ఆశయాలను ఆ దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు.
3. ఆశయాలు సాధించవలసిన గమ్యాన్ని సూచిస్తాయి
విలువ
1. సాంఘిక శాస్త్ర బోధన తర్వాత వచ్చే ఫలితాలే విలువలు.
2. విలువలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి.
3. విలువలు ఆశించిన ఫలితాలను సూచిస్తాయి.