దెబ్బకు దెబ్బ
మన చెన్నాల్రామలింగం కతలు ఎర్కనే గదుల్లా! గమ్మతి గమ్మతి.. ఖుషీ ఖుషీగుంటయి. ఇది గూడ గసొంటిదేనుల్ల. ఒకపారి చెన్నాల్రామలింగమోల్ల పక్కింట్లకు ఒక పొరుగు దేశపామె అచ్చింది. ఆమె కతలు మంచిగ జెప్పుతదంటని పేరువోయింది.
మన చెన్నాల్రామలింగం కతలు ఎర్కనే గదుల్లా! గమ్మతి గమ్మతి.. ఖుషీ ఖుషీగుంటయి. ఇది గూడ గసొంటిదేనుల్ల. ఒకపారి చెన్నాల్రామలింగమోల్ల పక్కింట్లకు ఒక పొరుగు దేశపామె అచ్చింది. ఆమె కతలు మంచిగ జెప్పుతదంటని పేరువోయింది. ఈ ముచ్చట ఆనోటా ఈనోటా ఇని.. మన చెన్నాల్రామలింగం సుత ఆమె తానకు వోయిండు. చెన్నాల్రామలింగం ఇకమతులోడనీ, బమ్మిని తిమ్మి – తిమ్మిని బమ్మి జేసుట్ల ఆయినెను మించినోడు లేడనీ.. పక్కపక్కలోళ్లు ఆమెకు జెప్పిండ్లు.
ఈయినెను ఎట్లనన్న ఆట వట్టియ్యాల్నని అనుకున్నదామె. చెన్నాల్రామలింగం రాంగనే.. “ఓ మంచి కత జెప్పవా!?” అని అడిగిందామె. ‘అగో! ఆమె కత జెప్పుతదని నేనత్తె.. ఉల్ట నన్నే కత జెప్పుమంటున్నదేంది?’ అనుకున్నడు చెన్నాల్రామలింగం. ఎంటనే.. కత జెప్పుడు షురూ జేషి.. “రాముడు సీత అనవాసానికి వోయిండ్లు..” అంట జెప్పి ఆగిండు. గంటాయె.. రెండు గంటలాయె.. ఒక్కమాట మాట్లాడడు. ఉల్కడు.. పల్కడు. దాంతోని ఆమె యాష్టకచ్చి.. “ఏమయ్యా! కత జెప్తనంటివి. ఒక్కమాటని ఊకుంటివి. అటెన్క ఏమైంది?” అంట అడిగింది. దానికి చెన్నాల్రామలింగం.. “అంత జెల్దయితదా!? ఆళ్లింక అడివిల నడుస్తున్నరే ఉన్నరు. అడివి దాటినంక మిగిల్న కత జెప్త!” అంట బొర్ర నిమురుకుంట వండుకున్నడు.
చెప్పుకోండి
- వాలం ఉంది కానీ కోతిని కాదు. నామం ఉంటుంది కానీ పూజారిని కాదు?
– ఉడుత
- కొప్పు ఉన్నా జుట్టు లేదు. కళ్లు ఉన్నా చూడలేదు?
– టెంకాయ
- నీ కోసం జీవిస్తే.. నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే.. జనంలో నిలిచిపోతావు.
– డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
మీకు తెలుసా?
పుట్టిన తర్వాత వచ్చే పాల పళ్లు ఊడిపోవడం.. కొత్తవి రావడం సహజం. అయితే, మనుషులకే కాకుండా, పాలిచ్చే అన్ని జీవులకూ ఇలా ఒక్కసారే జరుగుతుంది. కానీ, ఏనుగులు, కంగారూలకు మాత్రం.. జీవితకాలంలో కనీసం ఆరు సార్లయినా పళ్లు ఊడి మళ్లీ వస్తాయట.
జతచేయండి
పై బొమ్మలను వాటి సరైన నీడలతో జతచేయండి పద్యం – భావం చంపదగినయట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం : చంపదగినవాడైనప్పటికీ శత్రువు మన చేతికి చిక్కినప్పుడు.. అతణ్ని చంపకూడదు. ఎలాంటి హానీ చేయకూడదు. ఏదైనా మేలు చేసి మరీ వదిలిపెట్టడమే మంచిది. అదే అతనికి సరైన శిక్ష అవుతుంది.
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

