Namasthe Telangana | నమస్తే తెలంగాణ, ముల్కనూరి సాహితీ పీఠం ఆధ్వర్యంలో కథల పోటీ.. దరఖాస్తులు ఆహ్వానం
Namasthe Telangana | నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి ముల్కనూరు సాహితీ పీఠం [ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), హనుమకొండ జిల్లా] సంయుక్త నిర్వహణలో కథల పోటీలకు ఆహ్వానం. సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వైరుధ్యాల నేపథ్యంలో కథ ఉండాలి.
Namasthe Telangana | నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి ముల్కనూరు సాహితీ పీఠం [ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), హనుమకొండ జిల్లా] సంయుక్త నిర్వహణలో కథల పోటీలకు ఆహ్వానం. సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వైరుధ్యాల నేపథ్యంలో కథ ఉండాలి. నవ్యతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే కథలకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నాం. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలను ఎంపిక చేస్తాం. బహుమతి పొందిన కథలు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతాయి.
☞ పది కథలను సాధారణ ప్రచురణ కోసం స్వీకరిస్తాం.
☞ ఈ కథలకు వెయ్యి రూపాయలతోపాటు, జ్ఞాపికలు అందజేస్తాం.
☞ బహుమతి పొందిన కథలను పుస్తక రూపంలో అచ్చు వేసే అధికారం పోటీ నిర్వాహకులకు ఉంటుంది.
బహుమతుల వివరాలు
ప్రథమ బహుమతి (ఒక్కరికి) రూ. 50,000
2 ద్వితీయ బహుమతులు (ఒక్కొక్కరికి) రూ.25,000
3 తృతీయ బహుమతులు (ఒక్కొక్కరికి) రూ.10,000
6 కన్సొలేషన్ బహుమతులు (ఒక్కొక్కరికి) రూ.5,000
నియమ నిబంధనలు
☞ ఇంతకుముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో కానీ, వెబ్ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ, సోషల్ మీడియాలో కానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.
☞ ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
☞ పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
☞ ప్రచురణకు అంగీకరించని రాతప్రతులను తిరిగి పంపడం సాధ్యం కాదు.
☞ ఒకరు ఒక కథను మాత్రమే పంపాలి.
☞ రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత / రచయిత్రి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
☞ కథ అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
☞ పోటీలో బహుమతి పొందిన ఏ కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం రచయితలకు లేదని గమనించగలరు.
☞ బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. రచయితలకు ప్రాంతీయ భేదం లేదు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు.
పంపాల్సిన విధానం
☞ రాత ప్రతి అయితే కథ 12 పేజీలు మించకుండా ఉండాలి. పదాల్లో అయితే 1500 పదాలకు మించకూడదు. పరిధిని దాటితే, పరిశీలనకు స్వీకరించబడవు.
☞ ఈ-మెయిల్ ద్వారా పంపేవారు యూనికోడ్లో వర్డ్‌ఫైల్ పంపవచ్చు. దాన్ని పీడీఎఫ్‌లోకి కూడా మార్చి ఎటాచ్ చేయాలి.
☞ పేజ్మేకర్లో డీటీపీ చేయించి కథను పంపేవారు యూనికోడ్ ఫైల్‌ను, పీడీఎఫ్‌ను కూడా జతచేసి ఆ రెండిటినీ ఈ-మెయిల్లో ఎటాచ్ చేసి పంపాలి.
☞ కథలను ఆన్లైన్లో పంపేవారు దిగువ తెలిపిన ఐడీకి మాత్రమే మెయిల్ చేయాలి.
☞ కథల ప్రతులపై రచయిత/రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ రాయాలి.
ముల్కనూరు లేదా హైదరాబాద్‌లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది.
కథల పోటీ ఫలితాలు ‘నమస్తే తెలంగాణ’ బతుకమ్మలో ప్రచురితం అవుతాయి.
కథలు మాకు అందాల్సిన చివరి తేదీ ఫిబ్రవరి 29, 2024
కథలు పంపాల్సిన చిరునామా
బతుకమ్మ కథలపోటీ, నమస్తే తెలంగాణ
# 8-2-603/1/7, 8, 9, రోడ్ నంబర్ 10,
బంజారాహిల్స్, హైదరాబాద్ 500 034.
ఈ -మెయిల్ ఐడీ ntmulkanoorkatha2024@gmail.com
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

