శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

లంకకో విజయం

లంకకో విజయం

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో లంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్మల్‌ (4/27), లహిరు కుమార (3/32) విజృంభించడంతో జింబాబ్వే రెం డో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది.

  • జింబాబ్వేపై తొలి టెస్టులో 10 వికెట్లతో గెలుపు

హారారే: ఇటీవల టీమ్‌ఇండియా చేతిలో టీ20 సిరీస్‌ కోల్పోయిన శ్రీలంక జట్టు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో లంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్మల్‌ (4/27), లహిరు కుమార (3/32) విజృంభించడంతో  జింబాబ్వే రెం డో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 14 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని లంక 3 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 30/1తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 
logo