ENG vs AUS | మాంచెస్టర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఓపెనర్ జాక్ క్రాలీ (182 బంతుల్లో 189; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఇంగ్లిష్ ఆటగాళ్లు వన్డే తరహా దూకుడు కనబర్చడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్లో 72 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది.
జో రూట్ (84), మోయిన్ అలీ (54) హాఫ్సెంచరీలతో రాణించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 299/8తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టోక్స్ (24), బ్రూక్ (14) క్రీజులో ఉన్నారు.