లండన్ : నిర్భయమైన ఆటతో టీ20 బ్యాటింగ్‌కు సరికొత్త అర్థం చెబుతున్న యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ హాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ ‘టర్మినేటర్’తో పోల్చాడు. ఈ ఇద్దరు యువ క్రికెటర్లతో కలిసి లండన్‌లో ఆదివారం యానిక్ సినర్, జ్వెరెవ్ మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను యువీ వీక్షించాడు. ఈ సందర్భంగా యువీ స్పందిస న్తూ.. ‘నన్ను నేను ఎప్పుడూ ఒక టర్మినేటర్గా భావిస్తాను. ఇప్పుడు నాకంటే నాలుగు రెట్లు మెరుగైన టర్మినేటర్4 అభిషేక్ శర్మ ఉన్నాడు.
ఆ తర్వాత మరింత పరిణామం చెందిన టర్మినేటర్ 6 వైభవ్ సూర్యవంశీ వచ్చాడు. నా కాలంలో నేను నా పాత్రను పోషిస్తే.. అభి దాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాడు, ఇప్పుడు వైభవ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాడు. ఒకే ప్రయాణంలో ఇది మూడో దశ. అభికి శిక్షణ ఇవ్వడానికి నేను చాలా సమయం గడిపాను, భవిష్యత్తులో వైభవ్‌తో కూడా సమయం గడపాలని అనుకుంటున్నాను. అతడు అత్యుత్తమ ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకం నాకు ఉంది’ అని అన్నాడు.