వెల్లింగ్టన్: యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీ బాదడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. బ్రూక్‌తో పాటు రూట్ (101 బ్యాటింగ్) కూడా శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్ శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 315 పరుగులు చేసింది. బ్రూక్‌కు ఇది ఆరో టెస్టు కాగా.. తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఇంగ్లండ్ బ్యాటర్ 100.88 సగటుతో ఎనిమిది వందలకు పైగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వినోద్ కాంబ్లీ (798) రికార్డును బద్దలు కొట్టి.. టెస్టు క్రికెట్ చరిత్రలో 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.