Sunil Gavaskar: అదో చెత్త షాట్.. కోహ్లీనే అడగండి.. వీడియో
Sunil Gavaskar: కోహ్లీ ఓ సాధారణ షాట్ ఆడాడు... ఆ షాట్ గురించి అతన్నే అడగండి అంటూ గవాస్కర్ గరం అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ లైవ్ ఇంటర్వ్యూలో కోహ్లీ ఆట తీరును గవాస్కర్ తప్పుపట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా ఓడిన విషయం తెలిసిందే.
ఓవల్: డబ్ల్యూటీసీ ఫైనల్లో చివరి రోజు విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ ఔటైన తీరు గురించి చెప్పాంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అదో చెత్త షాట్ అని, సాధారణ ప్లేయర్ ఆడే షాట్ అని, నన్ను కాదు, కోహ్లీనే అడగండి అంటూ సునీల్ గవాస్కర్ సమాధానం ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తూ గవాస్కర్ ఈ కామెంట్ చేశారు. కోహ్లీ షాట్ సెలెక్షన్ సరిగా లేదని గవాస్కర్ అన్నారు.
49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఔటైన విషయం తెలిసిందే. అయితే బోలాండ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని చేజ్ చేసిన కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటి వరకు ఆఫ్ సైడ్‌లో పడిన బంతిని వదిలేసిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ కోసం ఒక్క పరుగు తీయాలనుకన్నాడని, ఏదైనా మైలురాయి దగ్గరపడినప్పుడు ఇలాగే ఉంటుందని, ఒక్క రన్ తీద్దామనుకుని, ఆఫ్ సైడ్ బంతిని కోహ్లీ చేజ్ చేసినట్లు గవాస్కర్ తెలిపారు.
జడేజా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 48 వద్ద ఇలాగే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే కూడా 46 రన్స్ వద్ద ఔటయ్యాడని, అప్పటి వరకు ఇలాంటి షాట్ ఆడని వాళ్లు, అకస్మాత్తుగా ఆ సమయంలో ఎందుకు ఆ షాట్ ఆడుతారని గవాస్కర్ ప్రశ్నించారు. మైలురాయికి దగ్గరగా ఉన్నామన్న సమయంలో బ్యాటర్ టెంప్ట్ అవుతారని మాజీ క్రికెటర్ తెలిపారు.
కోహ్లీ ఓ బ్యాడ్ షాట్ ఆడాడని, ఎలాంటి షాట్ ఆడాడో కోహ్లీనే అడగాలని, మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలో చాలా చెబుతాడని, అలాంటప్పుడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన విషయం అతని తెలియదా అని గవాస్కర్ అన్నారు. ఆఫ్ స్టంప్ బయటపడిన బంతిని అంత దూరం వెళ్లి ఆడాల్సిన అవసరం ఏమి వచ్చిందని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా 209 రన్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
https://twitter.com/ABVan/status/1667867324723138561?s=20
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

