Yashasvi Jaiswal | అతడు ఏం అన్నాడో మీకు తెలియదు.. హద్దు మీరిన వాళ్లను మేము వదిలిపెట్టం..!
Yashasvi Jaiswal : కొలంబో టెస్టులో వివాదం అనంతరం తనపై వస్తున్న విమర్శలపై భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) స్పందించాడు. తాను హద్దు మీరినట్టు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కథనాలపై యశస్వీ గట్టిగానే బదులిచ్చాడు.
Yashasvi Jaiswal : కొలంబో టెస్టులో వివాదం అనంతరం తనపై వస్తున్న విమర్శలపై భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) స్పందించాడు. తాను హద్దు మీరినట్టు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కథనాలపై యశస్వీ గట్టిగానే బదులిచ్చాడు. శ్రీలంక బౌలర్ అసితా ఫెర్నాండోతో మాటల యుద్ధంపై మాట్లాడుతూ.. మైదానంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని అతడు పేర్కొన్నాడు.
గాలే టెస్టులో విఫలమైన యశస్వీ జైస్వాల్ కొలంబోలోనూ 45 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. పెవిలియన్కు వెళ్లడానికి ముందు బౌలర్ అసితా ఫెర్నాండోతో భారత ఓపెనర్ గొడవపడ్డాడు. హాఫ్ సెంచరీ చేజార్చుకున్న అతడు కోపంతో ఊగిపోయాడు. దాంతో.. అందరూ యశస్వీదే తప్పు అనుకున్నారు.
🥵 THINGS GET HEATED! 🥵
Yashasvi Jaiswal and Asitha Fernando exchange words as tensions rise in the middle. 👀
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/7qJrORjx8V
— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026
క్రిక్బజ్ అయితే.. ఇన్స్టాగ్రామ్లో యశస్వీ హద్దు మీరి ప్రవర్తించాడా? అని అభిప్రాయ సేకరణ మొదలెట్టింది. దాంతో.. యశస్వీ నోరు విప్పాడు. నిజానిజాలు తెలియకుండా తనను జడ్జ్ చేయొద్దని స్పష్టం చేశాడు. అతడు ఏం అన్నాడో మీకు తెలియనప్పుడు నన్ను జడ్జ్ చేయకండి. ఎవరైనా హద్దు మీరితే భారత జట్టు, ఆటగాళ్లు మౌనంగా ఉండరని, గొడవకైనా సిద్ధమేనని వారికి తెలియజేస్తాం అని యశస్వీ వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే..
ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైనా.. భారత్కు శుభారంభమిచ్చిన యశస్వీ జైస్వాల్ను అసితా ఫెర్నాండో ఔట్ చేశాడు. 45 పరుగుల వద్ద ఉన్న అతడిని బౌల్డ్ చేసిన లంక పేసర్.. మాటల యుద్ధానికి తెరతీశాడు. దాంతో, యశస్వీకి కోపమొచ్చింది. పెవిలియన్ వెళ్లాల్సిన అతడు.. ‘ఏం అన్నావు’ అంటూ గుర్రుగా ఫెర్నాండో వైపు నడిచాడు.
End of the first ten overs on the opening day in Colombo 🏟️
A steady start from the the openers 👌#TeamIndia 31/0
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/Lox41PhuP8
— BCCI (@BCCI) August 23, 2026
ఫెర్నాండో సైతం తగ్గకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యేలా కనిపించింది. అయితే.. పరిస్థితిని గమనించిన లంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా ఇద్దరిని నిలువరించి దూరం పంపించేశాడు. పడిక్కల్(117) సెంచరీతో తొలి రోజును 300/5తో ముగించింది టీమిండియా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

