హైదరాబాద్: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యమ్లపల్లి సహజ తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. లాండ్స్విల్లే(అమెరికా) వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీఏ టోర్నీలో సహజ 6-1, 6-4తో టాప్‌సీడ్ ప్లేయర్ క్యాటరీనా బొండారెంకో(ఉక్రెయిన్)పై అద్భుత విజయంతో మెయిన్ డ్రాలోకి ప్రవేశించింది.
ఆది నుంచే తనదైన జోరు ప్రదర్శించిన సహజ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ డబుల్స్ విజేత అయిన క్యాటరీనా ఏ రకంగా ఆకట్టుకోలేకపోయింది.