Tokyo Olympics: రెజ్లింగ్ సెమీస్‌లోకి రవి దహియా, దీపక్ పూనియా

టోక్యో : టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా ( Deepak Punia ), రవి దహియా ( Ravi Dahiya ) లు సెమీస్‌లోకి ఎంటర్ అయ్యారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్‌పై 14-4 స్కోర్‌తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్‌పై రవి విజయం సాధించాడు. 23 ఏళ్ల రవికుమార్ తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్‌లో ప్రతి రౌండ్లోనూ రవికుమార్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌట్‌ను 13-2 స్కోర్ తేడాతో దహియా మ్యాచ్‌ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్.. ఆసియా చాంపియన్. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన దహియా.. కొలంబియా రెజ్లర్‌ను వత్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియడ్‌లో టెక్నికల్ సుపీరియార్టీతో మ్యాచ్‌ను 13-2 తేడాతో కైవసం చేసుకున్నాడు. సెమీస్‌లో కజికిస్తాన్‌కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.45కు జరుగుతుంది.
86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో దీపక్ పూనియా సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో అతను చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్‌పై 6-3 స్కోర్‌తో దీపక్ గెలిచాడు. అంతకుముందు ఇవాళ ఉదయం ప్రీ క్వార్టర్స్‌లో నైజీరియా రెజ్లర్ ఎకెరికెమి అగియోమోర్‌ను ఓడించాడు. టెక్నికల్ సుపీరియార్టీ పద్ధతిలో 12-1 స్కోర్ తేడాతో బౌట్‌ను దీపక్ గెలుచుకున్నాడు. మహుహరి మెస్సి స్టేడియంలో జరిగిన రెజ్లింగ్ పోటీలో.. దీపక్ పూనియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు మోచేతి గాయానికి లోనైన దీపక్ పూనియా.. తొలి మ్యాచ్‌లో కాస్త నెమ్మదిగా ఆరంభించినా.. ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. బ్రేక్ సమయంలో ఇండియన్ రెజ్లర్ 4-1 తేడాతో లీడ్‌లో ఉన్నాడు. ఇక సెకండ్ పీరియడ్‌లో తన వేగాన్ని మరింత పెంచేశాడు. సెమీస్‌లో డేవిస్ మోరిస్‌తో దీపక్ తలపడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

