నిరసన విరమించిన రెజ్లర్లు.. 4 వారాల లోపు విచారణ పూర్తి
Wrestlers protest: భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్.. మరికొంత మంది రెజ్లర్లు తమ నిరసనను విరమించారు. రెజ్లింగ్ సమాఖ్య నుంచి అధ్యక్షుడు బ్రిజ్ తప్పుకుంటారని మంత్రి అనురాగ్ హామీ ఇచ్చారు. రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపడుతామని మంత్రి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ రెజ్లర్లు తమ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చిన తర్వాత రెజ్లర్లు ఈ నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం రాత్రి నిరసన విరమిస్తున్నట్లు రెజ్లర్ భజరంగ్ పూనియాతో పాటు ఇతర రెజ్లర్లు మీడియా ముందు వెల్లడించారు.
రెజ్లర్లు చేసిన ఆరోపణలపై నాలుగు వారాల్లోగా విచారణ చేపట్టి రిపోర్ట్ ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కూడా ఆ విచారణకు సహకరించనున్నట్లు ఆయన చెప్పారు. అంత వరకు ఆయన సమాఖ్యకు దూరంగా ఉంటారని తెలిపారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మేటి రెజ్లర్ వినేశ్ పోగట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిరసన విరమించిన వారిలో వినేశ్తో పాటు భజరంగ్ పూనియా, సాక్షీ మాలిక్, రవి దహియాలు ఉన్నారు.
ఏడుగురు సభ్యలతో ఇండియన్ ఒలింపిక్ సంఘం ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిజ్‌పై వచ్చిన ఆరోపణలను ఆ కమిటీ విచారించనున్నది. మేటి బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఆ విచారణ కొనసాగనున్నది. ఆ ప్యానెల్లో డోలా బెనర్జీ, అలకనంద అశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లు సభ్యులుగా ఉంటారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

