WPL 2024, GG vs MI | గుజరాత్ బోణీ కొట్టేనా..? టాస్ గెలిచిన ముంబై
WPL 2024, GG vs MI | గత సీజన్లో తొలి మ్యాచ్ గుజరాత్ - ముంబై మధ్యే జరిగింది. 2023లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లోనే ఓడిన గుజరాత్.. తర్వాత కోలుకోలేకపోయింది. అయితే ఈ సీజన్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అలా కాకూడదని భావిస్తోంది.
WPL 2024, GG vs MI | గత సీజన్లో భారీ ఆశలతో బరిలోకి దిగి ఆడిన 8 మ్యాచ్‌లలో రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచిన గుజరాత్ జెయింట్స్.. రెండో సీజన్లో అయినా పుంజుకుంటుందా..? జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా గుజరాత్ గత సీజన్లో దారుణ వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంది. రెండో సీజన్లో బెత్ మూనీ సారథ్యంలో కొత్తగా కనిపిస్తున్న గుజరాత్.. నేడు ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు రానుంది. టాస్ నెగ్గిన ముంబై సారథి హర్మన్ ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
గత సీజన్లో తొలి మ్యాచ్ గుజరాత్ – ముంబై మధ్యే జరిగింది. 2023లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లోనే ఓడిన గుజరాత్.. తర్వాత కోలుకోలేకపోయింది. అయితే ఈ సీజన్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అలా కాకూడదని భావిస్తోంది. బెత్ మూనీ, లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్, ఫోబె లిచ్‌ఫీల్డ్ వంటి స్టార్ బ్యాటర్లు ఆష్లే గార్డ్నర్, స్నేహ్ రాణా వంటి ఆల్ రౌండర్లు ఉన్న గుజరాత్.. బౌలింగ్‌లో కాస్త వీక్‌గా కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబై.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరి ఈ రెండు జట్ల మధ్య గెలుపు ఎవరిని వరించేనో..!
తుది జట్లు: ఈ మ్యాచ్‌లో ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఆ జట్టులో మార్పులేమీ లేవు.
ముంబై ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా (వికెట్ కీపర్), నటాలీ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రకార్, అమన్‌జ్యోత్ కౌర్, ఎస్. సంజన, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ (కెప్టెన్, వికెట్ కీపర్), వేదా కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఫొబె లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, హేమలత, స్నేహ్ రాణా, తనూజా కన్వర్, కత్రిన్ బ్రైస్, లీ తహుహు, మేఘనా సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

