Aryna Sabalenka | చనిపోయిన తండ్రి కలను నిజం చేసిన టెన్నిస్ స్టార్
Aryna Sabalenka : యూఎస్ ఓపెన్‌లో(US Open 2023) రెండో సీడ్‌గా ఆడుగుపెట్టిన అరినా సబలెంక(Aryna Sabalenka) అనూహ్యంగా వరల్డ్ నంబర్ 1 అయింది. అయితే.. అగ్రస్థానానికి చేరాలనేది ఆమె తండ్రి సెర్గే సబలెంక(Sergey Sabalenka) కల. అనుకున్నట్టుగానే ఈ బెలారస్ క్రీడాకారిణి తన తండ్రి కలను నిజం చేసింది. అయితే.. ఇదంతా చూసేందుకు....
Aryna Sabalenka : యూఎస్ ఓపెన్‌లో(US Open 2023) రెండో సీడ్‌గా ఆడుగుపెట్టిన అరినా సబలెంక(Aryna Sabalenka) అనూహ్యంగా వరల్డ్ నంబర్ 1 అయింది. అయితే.. అగ్రస్థానానికి చేరాలనేది ఆమె తండ్రి సెర్గే సబలెంక(Sergey Sabalenka) కల. అనుకున్నట్టుగానే ఈ బెలారస్ క్రీడాకారిణి తన తండ్రి కలను నిజం చేసింది. అయితే.. ఇదంతా చూసేందుకు ఆయన ప్రాణాలతో లేరు. ఆయన 2019 నవంబర్‌లో కన్నుమూశారు. దాంతో, వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ అందుకున్నాక సబలెంక తండ్రిని తలచుకొని కన్నీటిపర్యంతమైంది.
‘ఆరోజు అనుకోకుండా జరిగింది. మా నాన్న చాలా యంగ్. ఆయనకు 43 ఏళ్లు అంతే. నన్ను ఆయన నంబర్ 1గా చూడాలని అనుకున్నారు. అందుకనే ప్రతి మ్యాచ్‌లో గట్టిగా పోరాడుతున్నా. ఆయన కోసమే ఇదంతా చేస్తున్నా. అతడి స్ఫూర్తే ఇప్పుడు నన్ను నడిపిస్తోంది’ అని సబలెంక వెల్లడించింది. రాకెట్ అందుకున్న తనను నంబర్ 1 చూడాలనేది తండ్రి కోరుకునేవాడని ఆమె 2020లో చెప్పింది. అప్పటి నుంచి ప్రతి టోర్నీలో కసిగా ఆడింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో సబలెంక అనుకున్నది సాధించింది.
తండ్రితో సబలెంక

మాజీ చాంపియన్, టాప్ సీడ్ ఇగ స్వియటెక్(Iga Swiatek) 16వ రౌండ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు మహిళల సింగిల్స్‌లో నంబర్ 1 ర్యాంక్ కూడా కోల్పోయింది. దాంతో, రెండో సీడ్ సబలెంక నంబర్ 1 ర్యాంక్‌కు ఎగబాకింది. 16వ రౌండ్లో ఈ బెలారస్ స్టార్ అదరగొట్టింది. రష్యాకు చెందిన డారియా కసత్నికా(Daria Kasatkina) పై 6-1, 6-3తో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరింది.
ఇవి కూడా చదవండి
Virender Sehwag | ఇండియా పేరు మార్పుపై వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచకప్‌లో మన జెర్సీలపై కూడా..
Sompal Kami | కోహ్లీ క్రికెటర్ మాత్రమే కాదు ఒక ఎమోషన్.. నేపాల్ ఆటగాడి పోస్ట్ వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

