Lionel Messi | ఉరుగ్వేతో వరల్డ్ కప్ క్వాలిఫయర్.. మెస్సీ ఆడేనా..?
Lionel Messi : వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా(Arjentina) మరో మెగా సమరానికి సిద్ధమవుతోంది. ప్రపంచ కప్ 2026 క్వాలిఫయర్‌లో భాగంగా శుక్రవారం(నవంబర్ 17) ఉదయం ఉరుగ్వేతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ లియోనల్...
Lionel Messi : వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా(Arjentina) మరో మెగా సమరానికి సిద్ధమవుతోంది. ప్రపంచ కప్ 2026 క్వాలిఫయర్‌లో భాగంగా శుక్రవారం(నవంబర్ 17) ఉదయం ఉరుగ్వేతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఆడతాడా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఎందుకంటే..? గాయాల కారణంగా మెస్సీ.. మేజర్ సాకర్ లీగ్‌లో ఇంటర్‌మియామి(Inter Miami) క్లబ్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వడమే అందుకు కారణం. దాంతో, ఉరుగ్వే మ్యాచ్‌లో అతడు ఆడడంపై సందిగ్ధత నెలకొంది. అయితే.. కోచ్ లూయిస్ స్కలోని(Luis Scaloni) గురువారం మీడియా సమావేశంలో మెస్సీ ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు.
‘మెస్సీ గాయాల నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతానికి అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే మెస్సీ 25 రోజుల క్రితం చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటికైతే అతడు యథావిధిగా శిక్షణ తీసుకుంటున్నాడు. మైదానంలో చురుకుగా కదులుతున్నాడు. కాబట్టి ఆందోళన అవసరం లేదు’ అని లూయిస్ తెలిపాడు.
నిరుడు ఖతర్‌లో వరల్డ్ కప్‌ను ముద్దాడుతున్న మెస్సీ

అంతేకాదు అర్జెంటీనా బలమైన జట్టు అని, స్టార్ ఆటగాడు మెస్సీ లేకున్నా కూడా అర్జెంటీనా ప్రత్యర్థులను ఓడించగలదని లూయిస్ చెప్పుకొచ్చాడు. నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ మ్యాజిక్ చేశాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో అతడు రెండు గోల్స్ కొట్టాడు. అయితే.. కిలియన్ ఎంబాపే హ్యాట్రిక్‌తో ఫ్రాన్స్ పోటీలోకి వచ్చినా.. చివరకు షూటౌట్లో 4-2తో అర్జెంటీనా గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
-
Israel – Hamas War | ఆసుపత్రి ఎంఆర్ఐ యూనిట్లో పెద్ద ఎత్తున ఆయుధాలు.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
-
CM KCR | మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలి.. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పిలుపు
-
Minister KTR | పని చేసే నాయకుడినే ప్రజలు ఆశీర్వదించాలి : మంత్రి కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

