పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో టైటిల్ ఆశలు గల్లంతు చేసుకున్న భారత్ మూడో స్థానం కోసం ఇంగ్లండ్తో తలపడనుంది. ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకొచ్చిన భారత జట్టుకు సెమీస్లో నెదర్లాండ్స్ చేతిలో పరాభవం ఎదురైంది. ఈ సమయంలో కనీసం కాంస్యం దక్కించుకోవాలనే పట్టుదలతో టీమ్ఇండియా ఉంది. 2013 ప్రపంచకప్లో చేసిన ప్రదర్శనను మంగళవారం పునరావృతం చేయాలని సలీమా సేన తహతహలాడుతున్నది. ఓటమి నుంచి తేరుకుని ముంతాజ్ ఖాన్, లాల్రిండికి, సంగీత కుమారితోపాటు ఒలింపిక్ ప్లేయర్లు కెప్టెన్ సలీమా టెటె, లాల్రెమ్సియామి, షర్మిలాదేవి రాణిస్తే భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరే అవకాశం ఉంది.