న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక మహిళల ఎన్బీఏ చాంపియన్‌షిప్‌లో లాస్ వేగాస్ ఏసెస్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లాస్‌వేగాస్ 78-71 తేడాతో కనెక్టికట్ సన్‌పై అద్భుత విజయం సాధించింది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన తుది పోరులో లాస్వేగాస్దే పైచేయి అయ్యింది. గార్డ్ చెల్సియా గ్రే 20 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తమ ఫ్రాంచైజీ చరిత్రలో లాస్‌వేగాస్‌కు ఇది తొలి డబ్ల్యూఎన్బీఏ టైటిల్ కావడం విశేషం. లాస్‌వేగాస్ ప్లేయర్ గార్డ్ చెల్సియాకు అత్యంత విలువైన ప్లేయర్ అవార్డు దక్కింది.