Mohammed Shami | షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది : మాజీ భార్య సంచలన కామెంట్స్
Mohammed Shami | మహమ్మద్ షమీ (Mohammed Shami) పై మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది.
Mohammed Shami | మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్న విషయం తెలిసిందే. తన అసమాన ఆటతో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్లు పడగొట్టి ప్రపంచకప్ వేటకు రాచబాటవేశాడు. ఈ మ్యాచ్‌తో అతడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. రాజకీయ, క్రికెట్, అభిమానులు, సినీతారలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు షమీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షమీ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది.
‘మహమ్మద్ షమీ ఎంత మంచి ఆటగాడో.. అలాగే మంచి భర్తగా, తండ్రిగా ఉంటే.. మేమంతా కలిసి సంతోషంగా ఉండే వాళ్లం. దీంతో అతడికి ఇప్పుడు లభించే గౌరవం కంటే ఇంకాస్త ఎక్కువ వచ్చేది. కానీ, అతని దురాశ, చెడు ఆలోచనలు, తప్పుల కారణంగా మేము ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. షమీ డబ్బుతో నిజాల్ని దాచాలని చూస్తున్నాడు’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, షమీ ప్రదర్శనపై ఇప్పటికే హసీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న హసీన్‌కు షమీ ప్రదర్శనపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది.
షమీ-హసీన్ జహాన్‌లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. కానీ 2018లో హసీన్.. షమీపై వేధింపుల కేసు నమోదుచేసింది. కొద్దిరోజుల క్రితమే గృహహింస కేసు కింద కోల్‌కతా కోర్టు.. షమీ, హసీన్‌కు నెలకు లక్షా ముప్పై వేల రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. 2018 నుంచి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
Also Read..
Mohammed Shami | టీమ్ఇండియా పేసర్ షమీ ఊర్లో మినీ స్టేడియం, జిమ్..
Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య
Dog Bites | ఆస్ట్రియా ప్రధానిని కరిచిన మాల్డోవా అధ్యక్షురాలి పెంపుడు శునకం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

