Lionel Messi: ఫ్రీగా ఆడతానన్నా మెస్సీ బార్సిలోనాలో కొనసాగడం కుదరదు.. ఎందుకు?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) ఈ మధ్యే స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగతి తెలుసు కదా. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్లబ్.. మెస్సీలాంటి ఖరీదైన ఆటగాన్ని కొనసాగించడం అసాధ్యం.

బార్సిలోనా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) ఈ మధ్యే స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగతి తెలుసు కదా. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్లబ్.. మెస్సీలాంటి ఖరీదైన ఆటగాన్ని కొనసాగించడం అసాధ్యం. పైగా మెస్సీ తన ఫీజును మరో 30 శాతం పెంచాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ పుకార్లను మెస్సీ ఖండించాడు. జీతం పెంచడం కాదు కదా.. 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బార్సిలోనాలోనే కొనసాగడానికి ప్రయత్నించాను అని మెస్సీ మొన్న ఫేర్వెల్ సందర్భంగా చెప్పాడు. అయితే జీతం 50 శాతం తగ్గించుకోవడం కాదు.. అసలు ఫ్రీగా ఆడతానన్నా అతడు బార్సిలోనాలో కొనసాగడం కుదరదని రూల్స్ చెబుతున్నాయి.
ఫ్రీగా ఎందుకు ఆడలేడు?
ఫుట్‌బాల్‌లోనే కాదు.. ఏ గేమ్‌లో అయినా ఓ ప్లేయర్ ఓ టీమ్‌తో కొనసాగాలని గట్టిగా అనుకొని ఫ్రీగా ఆడాలని నిర్ణయించుకుంటే ఎవరు మాత్రం వద్దంటారు. కానీ స్పానిష్ లీగ్‌లో మాత్రం అలా కుదరదు. మెస్సీ తన ఫీజును 50 శాతం తగ్గించుకుంటానని చెప్పాడు. అది కాదు కదా.. అసలు మొత్తానికే ఫ్రీగా ఆడాలని నిర్ణయించుకున్నా మెస్సీకి ఆ అవకాశం లేదు. నిజానికి మెస్సీ తన ఫీజును గరిష్ఠంగా 50 శాతం కంటే తగ్గించుకోవడానికే వీలు లేదు. స్పానిష్ నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్కడి ఉపాధి చట్టం ప్రకారం.. ఎవరైనా ఉద్యోగి తన వేతనంలో 50 శాతం మాత్రమే కోత విధించుకోవచ్చు. అంతకు మించి అవకాశం ఉండదు.
ఆర్థికపరమైన అవకతవకలను అడ్డుకోవడానికి స్పెయిన్ ఈ నిబంధన తీసుకొచ్చింది. ఒకవేళ స్పెయిన్‌లో ఆ చట్టం లేకపోయినా కూడా లా లిగా నిబంధనల ప్రకారం కూడా మెస్సీ బార్సిలోనాలో కొనసాగలేడు. దీనికి కారణం.. ఓ క్లబ్ తన వార్షిక ఆదాయంలో ప్లేయర్స్‌కు చెల్లించాల్సిన గరిష్ఠ మొత్తం 70 శాతం మాత్రమే. ఇప్పుడు బార్సిలోనా జీతాల నుంచి మెస్సీ జీతం మొత్తం తీసేసినా.. వారి వార్షిక ఆదాయంలో ఈ మొత్తం 95 శాతంగా ఉంది. అంటే 70 శాతం కంటే ఇప్పటికే చాలా ఎక్కువే. ఆ లెక్కన మెస్సీ ఫ్రీగా కొనసాగాలన్నా.. అవకాశం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఖరీదైన ప్లేయర్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకోవడం బార్సిలోనాను ఆర్థికంగా దెబ్బతీసి, అప్పులు పాలయ్యేలా చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

