IPL 2023 | ఓవర్లు కుదిస్తే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం సీఎస్కే టార్గెట్..?
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. దాంతో, మ్యాచ్ ఆగిపోయింది. చినుకులు తగ్గడంతో సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ 10ః45 తర్వాత పిచ్‌ను పరిశీలించాక ఆట కొనసాగింపు, ఓవర్ల కుదింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే చెన్నై టార్గెట్ ఎంత ఉంటుంది అంటే..
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. దాంతో, మ్యాచ్ ఆగిపోయింది. చినుకులు తగ్గడంతో సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ 10ః45 తర్వాత పిచ్‌ను పరిశీలించాక ఆట కొనసాగింపు, ఓవర్ల కుదింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే చెన్నై టార్గెట్ ఎంత ఉంటుంది అంటే.. 20 ఓవర్ల ఆట సాగితే చెన్నై విజయానికి 211 పరుగులు కావాలి. అయితే.. ప్రస్తుతం 0.3 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 4/0. అదే 19 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే చెన్నై 207 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 18 అయితే.. 198 టార్గెట్, 17 ఓవర్లకు 190 కొట్టాలి. 14 ఓవర్లు ఆట సాగితే 162, 10 ఓవర్లు మ్యాచ్ జరిగితే 123 పరుగులు చేయాలి. అలా కాకుండా 5 ఓవర్లు మాత్రమే ఆడిస్తే చెన్నై 66 పరుగులు కొడితే చాంపియన్‌గా నిలుస్తుంది.
చెన్నై బ్యాటింగ్ ఆరంభానికి ముందు చిన్న జల్లులు పడ్డాయి. కొద్ది సేపటికే చినుకులు తగ్గడంతో సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. తొలి ఓవర్ మూడో బంతి పడగానే మళ్లీ వర్షం మొదలైంది. షమీ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(4) మూడో బంతికి ఫోర్ బాదాడు. ఆ తర్వాత వర్షం మొదలైంది. దాంతో, సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను కవర్లతో కప్పేశారు. డెవాన్ కాన్వే(0) క్రీజులో ఉన్నాడు.
సుదర్శన్ సెంచరీ మిస్
ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. సొంత గ్రౌండ్లో టాపార్డర్ బ్యాటర్లు దంచి కొట్టారు. గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్(39) విఫలమైనా.. సాయి సుదర్శన్(96 : 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(54 : 39 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది. ఐపీఎల్ ఫైనల్లో రికార్డు స్కోర్ చేసిన జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. 2016 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కొట్టిన 208/7 స్కోర్‌ను అధిగమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

