FIFA World Cup | మెస్సీని నిలువరించడం కష్టమే.. అయినా మేము సిద్ధంగా ఉన్నాం : క్రొయేషియా కెప్టెన్
క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా బ్రెజిల్‌పై షూటౌట్లో 4-2తో విజయం సాధించింది
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్ ఈరోజు జరగనుంది. అర్జెంటీనా, క్రొయేషియా జట్టు ఫైనల్ బెర్తు కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకున్నాయి. దాంతో సెమీ ఫైనల్ హోరాహోరీగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో తమకు ఫామ్‌లో లియోనల్ మెస్సీతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని క్రొయేషియా జట్టు కెప్టెన్ అన్నాడు. ‘అవును.. మెస్సీతో ప్రమాదమే. అయినా మేము సిద్ధంగా ఉన్నాం. మ్యాచ్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం’ అంటూ లుకా మోడ్రిక్ స్పందించాడు. అంతేకాదు ‘మెస్సీ చాలా పెద్ద అటగాడు. అతను అర్జెంటీనా టీమ్ ఉత్తమ ఆటగాడు. అతడిని నిలువరించే క్రమంలో మాకు చాలా కష్టాలు ఎదురువుతాయి. అయినా మా ప్రణాళికలు మాకు ఉన్నాయి’ అంటూ లుకా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరఫున ఆడిన లుకా మిడ్ ఫీల్డర్‌గా ఆరితేరాడు.
క్రొయేషియా జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ అయిన బ్రెజిల్‌పై షూటౌట్లో4-2తో విజయం సాధించింది. మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను పెనాల్టీ షూట్లో 4-3తో ఓడించింది. రెండో సెమీఫైనల్ ఫ్రాన్స్, మొరాకో మధ్య గురువారం జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

