David Warner | స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేస్తూ.. ఒంటిచేత్తో క్యాచ్ పట్టిన వార్నర్.. వీడియో చూశారా..!
David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్(Australia Opener) డేవిడ్ వార్నర్(David Warner) సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. తీరిక దొరికితే చాలు టిక్‌టాక్ వీడియో(TikTok Videos)లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. తాజాగా వార్నర్ అలాంటి పనే చేశాడు. అయితే.. ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న 'బార్బీ' (Barbie) పాటను కాపీ కొట్టాడు. ఈమధ్యే ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్(Ashes Series) ముగియడంతో...
David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్(Australia Opener) డేవిడ్ వార్నర్(David Warner) సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. తీరిక దొరికితే చాలు టిక్‌టాక్ వీడియో(TikTok Videos)లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. తాజాగా వార్నర్ అలాంటి పనే చేశాడు. అయితే.. ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న ‘బార్బీ’ (Barbie) పాటను కాపీ కొట్టాడు. ఈమధ్యే ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్(Ashes Series) ముగియడంతో వార్నర్ కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లోకి జంప్ చేస్తూ అతను ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.
వార్నర్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. దానికి ఈ డాషింగ్ ఓపెనర్ కిన్ ఇన్ యాక్షన్ అని క్యాప్షన్ పెట్టాడు. వార్నర్ డైవింగ్ చేసి బంతిని పట్టుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఫేమస్ ర్యాప్ గ్రూప్ అక్వా(Aqua) ‘బార్బీ గర్ల్'(Barbie Girl) పాట వినిపిస్తుంది.
గత కొంతకాలంగా ఫామ్లోమితో విమర్శల పాలైన వార్నర్ ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్‌గా 5 హాఫ్ సెంచరీలతో రాణించాడు. అయితే.. భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) మాత్రం విఫలయమ్యాడు. అయినా కూడా ఆసీస్ సెలెక్టర్లు అతడిని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల్లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగిన వార్నర్ మిగతా మూడు మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు.
డేవిడ్ వార్నర్

ఒక్క సెంచరీ కొట్టకపోయినా కూడా మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)తో కలిసి శుభారంభాలు ఇచ్చాడు. అయితే.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) ఓవర్లో పదే పదే ఔటై విమర్శల పాలయ్యాడు. ఇప్పటివరకూ ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను బ్రాడ్ 18సార్లు పెవిలియన్‌కు పంపడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్‌లో వార్నర్ 285 పరుగులతో పర్వాలేదనిపించాడు. వచ్చే ఏడాది సొంత గడ్డపై పాకిస్థాన్‌తో సిరీస్‌లో వార్నర్ టెస్టులకు గుడ్ బై చెప్తాడని సమాచారం.
ఇవి కూడా చదవండి
Rishabh Pant | నెట్స్‌లో రిషభ్ పంత్.. వరల్డ్ కప్‌లోపు ఫిట్నెస్ సాధించేనా..?
Nasser Hussain | బాజ్‌బాల్ ఆటకు అసలైన పరీక్ష భారత గడ్డపైనే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

