Vishnu Solanki | కూతురు అంత్యక్రియల్లో పాల్గొని వచ్చి సెంచరీ చేశాడు.. ఎవరంటే?
క్రికెటర్ విష్ణు సోలంకి భార్య ఈ నెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పుట్టిన 24 గంటల్లోనే చిన్నారి చనిపోయింది. పుట్టెడు దుఃఖంలోనే విష్ణు చివరిరోజున జట్టులో చేరాడు. సెంచరీ చేశాడు
బరోడా: సంకల్పం ఉంటే ఎంతటి కఠిన పనినైనా ఆవలీలగా చేయవచ్చునంటారు పెద్దలు. దీనికి పర్యాయపదంగా బరోడాకు చెందిన క్రికెటర్ విష్ణు సోలంకిని చెప్పుకోవచ్చు. బరోడా బ్యాట్స్‌మెన్ విష్ణు సోలంకి చేసిన సెంచరీతో చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా జట్టు పటిష్ట స్థితికి చేరుకున్నది. ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు ప్రత్యర్థిపై 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్నది. ఇక్కడ బరోడా జట్టును ఆధిక్యంలో నిలిపిన విష్ణు శతకం విభిన్నమైనది కాదు. ఆయన సంకల్పం అలా ఆయనతో సెంచరీ చేయించింది. ఎలాగంటే..
విష్ణు సోలంకి భార్య ఈ నెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్త అందగానే విష్ణు ఇంటికి చేరుకున్నాడు. దాంతో బరోడా తొలి రంజీ మ్యాచ్‌లో విష్ణు ఆడలేకపోయాడు. దురదృష్టవశాత్తు పుట్టిన 24 గంటల్లోనే చిన్నారి చనిపోయింది. చిన్నారి అంత్యక్రియలకు విష్ణు ఇంటి వద్దే ఉండిపోయాడు. పుట్టెడు దుఃఖంలోనే విష్ణు చివరిరోజున జట్టులో చేరాడు. చండీగఢ్‌పై సెంచరీ సాధించిన విష్ణు.. ఆ ఘనతను చనిపోయి తన కుమార్తెకు అంకితమిచ్చాడు. 104 పరుగుల వద్ద ఔటైన విష్ణు.. తొలి ఇన్నింగ్స్‌లో 517 పరుగుల భారీ స్కోరుతో బరోడాను ముందుంచాడు. చనిపోయిన తన కుమార్తెను తలుచుకుంటూ కూర్చోకుండా తన సంకల్పాన్ని గుర్తు చేసుకొని జట్టును అగ్రభాగాన నిలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

