Virat Kohli | న్యూఢిల్లీ: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల బెంగళూరు వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మెంటార్ గంభీర్‌ను హత్తుకోవడంపై వస్తున్న వాదనలపై రన్ మెషీన్ స్పందించాడు. గంభీర్- కోహ్లీ హగ్‌పై గవాస్కర్ వంటి క్రికెట్ విశ్లేషకులు.. ‘వాళ్లిద్దరికీ ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు’ అని కామెంట్ చేయగా సోషల్ మీడియాలోనూ దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ… ‘కొంతమంది నా వ్యవహార శైలి చూసి నిరాశపడ్డారు. నేను ఆరోజు నవీన్, గౌతీ భాయ్ (గంభీర్)ను హగ్ చేసుకున్నాను. పలువురు మసాలాను మిస్ అయ్యారు’ అంటూ పరోక్షంగా చురకలంటించాడు.