బెంగళూరు: క్లిష్ట పరిస్థితులే తనలోని పోరాటతత్వాన్ని బయటకు తీస్తాయని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విలువైన ఇన్నింగ్స్‌లు ఆడే కోహ్లీ.. గత 15 ఏండ్లుగా అలాంటి సవాళ్లే తనను మరింత రాటుదేల్చాయని వెల్లడించాడు. ‘మీ ముందు కఠిన సవాళ్లు ఉన్నప్పుడు. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించండి. అప్పుడే జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. పరిస్థితుల నుంచి పారిపోవద్దు. 15 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో నేను కఠిన పరిస్థితులకు ఎప్పుడూ తలవంచలేదు. మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అందులో ఎదురయ్యే సవాళ్ల కోసం ఆసక్తిగా ఉన్నా. అప్పుడే మనం ఇంకా ముందుకు సాగగలం’ అని కోహ్లీ అన్నాడు. ప్రతి ఒక్కరూ విజయం సాధించేందుకే ప్రయత్నిస్తారని అయితే.. ఒత్తిడిని అధిగమించడమే ప్రధానమని విరాట్ పేర్కొన్నాడు.
కోహ్లీ ముల్లెట్ స్టయిల్
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముల్లెట్ స్టయిల్లో వారెవ్వా అనిపిస్తున్నాడు. మంగళవారం నుంచి మొదలవుతున్న ఆసియాకప్‌లో కోహ్లీ నయా లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు.