ICC Rankings: మళ్లీ టాప్ – 3 లోకి వచ్చిన కోహ్లీ.. అగ్రస్థానం దిశగా దూసుకొస్తున్న కింగ్
ICC Rankings: ప్రపంచకప్ ప్రారంభానికి ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ.. నెలన్నర తిరగకముందే మూడో ర్యాంకుకు చేరుకున్నాడు.
ICC Rankings: వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దిశగా దూసుకొస్తున్నాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ.. నెలన్నర తిరగకముందే మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ.. ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరాడు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీతో పాటు భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. 826 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్ 824 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 791 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా టీమిండియా సారథి రోహిత్ శర్మ 769 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్‌లో నిలిచాడు.
October 5th – Number 9 ranked ODI batter.
November 22nd – Number 3 ranked ODI batter.
King Kohli is coming for the Top spot. 🐐 pic.twitter.com/waF2HJQTmU
— Johns. (@CricCrazyJohns) November 22, 2023
బౌలర్ల జాబితాలో కేశవ్ మహారాజ్.. 741 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా జోష్ హెజిల్వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్.. 699 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా బుమ్రా (685 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. 667 పాయింట్లతో కుల్దీప్ యాదవ్ ఆరో స్థానంలో ఉండగా మహ్మద్ షమీ 648 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. ఇక మూడు ఫార్మాట్లలో భారత జట్టు నెంబర్ వన్‌గా కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

